Relationship Tips: మీరు మీ భాగస్వామిని డబ్బుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడగకూడదు. మీరు ఇలా చేస్తే.. అది మీ సంబంధాలను పాడుచేయవచ్చు, మీరు అసౌకర్యానికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు. బంధం ఎంత గాఢమైనా డబ్బు వల్ల ఒక్కోసారి తెగిపోతుంది. అటువంటి పరిస్థితిలో.. భాగస్వామి కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. రిలేషన్‌షిప్‌లో సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని పద్దతు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
రిలేషన్‌షిప్‌లో బాధ కలిగించే అశాలు:
- మీరు మీ భాగస్వామిని పొరపాటున కూడా డబ్బుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగకూడదని గుర్తు ఉంచుకోవాలి.
- నేను మీ డబ్బును ఉపయోగించవచ్చా? ఈ ప్రశ్నతో మీరు మీ భాగస్వామి నుంచి డబ్బు అడుగుతున్నట్లు అనిపిస్తుంది.
- ఆ వస్తువు కొన్నావా..? ఈ ప్రశ్న అడగడం ద్వారా మీరు వారి ఖర్చు అలవాట్లను నియంత్రించాలనుకుంటున్నట్లు అనిపిస్తుంది.
- అంత డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టావు? అలాంటి ప్రశ్న అడగడం కూడా మీ భాగస్వామికి బాధ కలిగించవచ్చు.
- డబ్బు గురించి భాగస్వామితో మాట్లాడటం ముఖ్యం. కానీ సరైన మార్గంలో చేస్తే అది సంబంధాన్ని పాడుచేయదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రోజంతా నిద్రపోతున్నారా? కారణం ఇదే కావొచ్చు!