Trump: కోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు.. రూ.692 కోట్ల భారీ జరిమానా..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయనపై పరువునష్టం దావా వేసిన జీన్ కరోల్‌కు.. ట్రంప్ 83.3 మిలియన్ డాలర్లు ( రూ.692 కోట్లు) చెల్లించాలని మాన్‌హటన్‌ కోర్టు తీర్పునిచ్చింది.

Trump: కోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు.. రూ.692 కోట్ల భారీ జరిమానా..
New Update

అమెరికా అధ్యక్ష పదవిని మరోసారి దక్కించుకోవాలని ఆరాటపడుతున్న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు వరుసగా కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కరోల్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై న్యూయార్క్‌లోని మామ్‌హటన్ ఫెడరల్ కీలక తీర్పునిచ్చింది. ట్రంప్‌ ఆమెకు 83.3 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు రూ.692 కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కొన్నేళ్ల క్రితం లైంగిక తనను లైంగికంగా వేధించిన ట్రంప్.. ఇప్పుడు తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించారంటూ ఇటీవల జీన్ కరోల్ కోర్టులో పిటిషన్ వేశారు.

అయితే ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ట్రంప్‌కు భారీ జరిమాన విధిస్తూ తీర్పునిచ్చింది. కరోల్‌కు నష్టపరిహారం కింద 13.3 మిలియన్‌ డాలర్లతో సహా.. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు మరో 65 మిలియన్ డాలర్లు అదనంగా చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది. శుక్రవారం దీనిపై విచారణ జరుగుతుండగానే.. ట్రంప్ కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు.

కేసును రాజకీయంగా వాడుతున్నారు

జీన్‌ కరోల్‌ను ట్రంప్‌ లైంగికంగా వేధించారని గత ఏడాది మే నెలలో కోర్టు నిర్ధారించింది. దీంతో ఆమెకు 5 మిలియన్‌ డాలర్లు చెల్లించాలంటూ ఆదేశించింది. అయితే, కరోల్‌ తన రచనలను విక్రయించుకోవడం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్‌ విమర్శలు చేశారు. దీంతో ఆమె పరువునష్టం కేసు దాఖలు చేయడంతోయ.. దీనిపైనే తాజాగా విచారణ జరిపిన మాన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు.. కరోల్‌కు ట్రంప్ మరో 83.3 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ జరిమానాపై స్పందించిన ట్రంప్ బైడెన్‌ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ తీర్పు హాస్యాస్పదమని.. మన న్యాయవ్యవస్థ నియంత్రణ కోల్పోందని.. ఈ కేసును రాజకీయ ఆయుధంగా వాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాను కోర్టులో అప్పీలు చేస్తానని చెప్పారు.

కేసు ఏంటి..

అసలేం జరిగిందంటే.. 1996లో మాన్‌హటన్‌లోని ఓ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో కరోల్‌కు ట్రంప్‌ పరిచయమయ్యారు. అప్పుడు వేరే మహిళకు లోదుస్తులు గిఫ్ట్‌గా ఇవ్వాలంటూ ట్రంప్‌ తనతో మాట కలిపారని కరోల్‌ తెలిపారు. అయితే ఆ సమయంలో ఒంటరిగా ఉన్న తనపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలు చేశారు. దీంతో తాను షాకయ్యాయని.. అత్యాచార బాధితురాలిగా తనను తాను చూసుకోలేకపోవడం వల్లే అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయాయని తెలిపారు. ఈ ఘటన జరిగిన కొన్నేళ్ల తర్వాత ఓ పుస్తకంలో ఆమె చెప్పిన వివరాలను న్యూయార్క్‌ మ్యాగజైన్‌ 2019లో ప్రచురించింది. దీంతో వాటిపై స్పందించిన ట్రంప్‌.. ఆమెనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరికి ఆమె కోర్టును ఆశ్రయించారు.

#trump #newyork
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe