US Presidents Assassinations and Attempts: అమెరికా చరిత్రంతా హత్యలు, హత్యాయత్నాలే.. లింకన్‌ నుంచి ట్రంప్‌ వరకు.. !

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. గతంలోనూ అమెరికా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులపై హత్యాయత్నాలు జరిగాయి. లింకన్‌, కెన్నెడి అధ్యక్షులుగా ఉన్న సమయంలో హత్యకు గురయ్యారు. బుష్‌, బిల్ క్లింటన్‌లు తృటిలో తప్పించుకున్నారు.

US Presidents Assassinations and Attempts: అమెరికా చరిత్రంతా హత్యలు, హత్యాయత్నాలే.. లింకన్‌ నుంచి ట్రంప్‌ వరకు.. !
New Update

అది ఏప్రిల్ 14, 1865..
ప్రాంతం: వాషింగ్టన్‌ డీసీ, ఫోర్డ్స్ థియేటర్‌
తుపాకీ తుటాల శబ్దాలు వినిపించాయి.. కాల్చింది మరెవరినో కాదు.. అమెరికా 16వ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్‌ను. 'అవర్ అమెరికన్ కజిన్' అనే డ్రామాను ఫోర్డ్స్ థియేటర్‌లో చూస్తున్న అబ్రహం లింకన్‌ను జాన్ విల్క్స్‌బూత్ కాల్చిచంపాడు. శ్వేత జాత్యహంకారులు లింకన్‌పై చేసిన కుట్ర ఇది. అంతకముందు జనవరి 1,1863న 'బానిస విముక్తి' చట్టాన్ని అమల్లోకి తెచ్చిన లింకన్‌పై కక్ష పెంచుతున్న జాత్యహంకారులు లింకన్‌ను జాన్‌ చేత హత్య చేయించారు.

US Presidents Assassinations and Attempts 1865లో లింకన్‌ హత్య (ప్రతీకాత్మక చిత్రం) PC: historynet

అది నవంబర్‌ 22, 1963..
ప్రాంతం: డల్లాస్
డీలీ ప్లాజా గుండా మోటర్‌కేడ్‌లో వెళుతున్న అమెరికా 35వ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నెడిని హత్య చేశారు. కమ్యూనిస్టు భావజాలాన్ని నరనరాన ఎక్కించుకున్న రూబీ ఓస్వాల్డ్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు.

US Presidents Assassinations and Attempts 1963లో కెన్నెడీ హత్య

కేవలం కెన్నెడి, లింకన్‌ మాత్రమే కాదు.. మొత్తంగా నలుగురు అమెరికా అధ్యక్షులు పదవిలో ఉండగానే హత్యకు గురయ్యారు. విలియం మెకిన్లీ, జేమ్స్ గార్‌ఫీల్డ్ ఇందులో ఉన్నారు. అటు హత్యాయత్నాలు విఫలమైన చాలానే ఉన్నాయి. అమెరికా అధ్యక్షులతో పాటు అమెరికా మాజీ అధ్యక్షులపై కాల్పులు జరగడం, లేదా దుండగులు హత్యకు ప్రయత్నించడం చాలాసార్లు జరిగింది. తాజాగా జులై 14న పెన్సిల్వేనియాలో ఆమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పులు జరగడం.. ఆయన చెవికి తీవ్రంగా గాయాలు కావడం అగ్రరాజ్యంలో ప్రకంపనలు రేపింది. ట్రంప్‌ను హత్యచేసేందుకే ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు ఇప్పటికే ఓ నిర్ధారణకు వచ్చారు. ప్రజాస్వామ్యానికి కేరాఫ్‌గా నిలిచే అమెరికాలో గన్‌ కల్చర్‌ ఏ విధంగా ఉందో చెప్పేందుకు ట్రంప్‌పై కాల్పుల ఘటనే అతి పెద్ద ఉదాహరణ.

US Presidents Assassinations and Attempts అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ (File)

ఏంటీ 'సీక్రెట్ సర్వీస్‌'?:
జార్జ్ డబ్ల్యూ బుష్, డొనాల్డ్ ట్రంప్‌లతో సహా చాలా మంది అధ్యక్షులు, మాజీ అధ్యక్షులపై హత్యాప్రయత్నాలు జరిగాయి. 1901లో విలియం మెకిన్లీ మరణం తరువాత, అధ్యక్షుడికి పూర్తి-సమయం భద్రతను కల్పించాలని అమెరికా కాంగ్రెస్ 'సీక్రెట్ సర్వీస్‌'ను ఆదేశించింది. ఈ పాత్రను ఫెడరల్ ఏజెన్సీ ఇప్పటికీ నిర్వహిస్తోంది. అందుకే ట్రంప్‌పై కాల్పులు జరిగిన వెంటనే దుండగుడిని గుర్తించిన 'సీక్రెట్ సర్వీస్‌' అతడిని కాల్చి చంపింది. అయితే 'సీక్రెట్‌ సర్వీస్‌' హెడ్‌ ట్రంప్‌కు పటిష్ఠ భద్రత కల్పించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

US Presidents Assassinations and Attempts మార్చి 30, 1981.. నాట అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై హత్యాయత్నం

గతంలోనూ ఇంతే:
అమెరికా మాజీ అధ్యక్షులపై గతంలోనూ హత్యాయత్నాలు జరిగాయి. 1993లో మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్‌ డబ్ల్యూ బుష్‌ని కువైట్ పర్యటనలో ఉండగా హత్య చేసేందుకు కుట్ర జరిగింది. కారులో బాంబు పెట్టి చంపాలని చూశారు. ఈ ప్రయత్నం వెనుక ఇరాక్ ఇంటెలిజెన్స్ ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.అయితే కువైట్ అధికారులు ఈ ఘటన సమయంలో 17 మందిని అరెస్టు చేయడంతో కుట్ర విఫలమైందని చెబుతుంటారు.

  • 2005లో జార్జి డబ్ల్యూ. బుష్ జార్జియాలోని టిబిలిసిలో హత్యాయత్నానికి గురయ్యాడు. బుష్‌ మాట్లాడుతున్న వేదికపైకి దుండగులు గ్రెనేడ్ విసిరారు. అయితే అది పేలలేదు.
  • అటు మాజీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో థియోడర్ రూజ్‌వెల్ట్‌పై హత్యయత్నం జరిగింది. అయితే అది కాస్త విఫలమైంది. ఓవైపు గాయాలు తగిలినా రూజ్‌వెల్ట్‌ మాత్రం వైద్య సహాయం తీసుకోవడానికి ముందు 84 నిమిషాల ప్రసంగం చేశారు.US Presidents Assassinations and Attempts

ఆండ్రూ జాక్సన్ (1835), రాల్డ్ ఫోర్డ్ (1975), రోనాల్డ్ రీగన్ (1981), బిల్ క్లింటన్ (1994)తో సహా అనేక మంది అధ్యక్షులుగా ఉన్న సమయంలోనే కాల్పులు జరిగాయి. ఇలా మాజీ అధ్యక్షులు, అధ్యక్షులపై హత్యయత్నాలు జరగడం అమెరికా చరిత్ర పొడుగునా కనిపిస్తుంది. 1901లో 'సీక్రెట్ సర్వీస్‌'ను అమెరికా అధ్యక్షులకు రక్షణగా ఏర్పాటు చేసిన అమెరికా.. 1965 నుంచి మాజీ అధ్యక్షులకు వారికి జీవితాంతం రక్షణ ఉండేలా 'సీక్రెట్‌ సర్వీస్‌'ని ఉంచాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. అయితే 2012లో ఈ నిర్ణయాన్ని సవరించారు. పదవి విడిచిన తర్వాత మాజీ అధ్యక్షులకు పదేళ్ల వరకు 'సీక్రెట్ సర్వీస్‌'ని రక్షణగా ఉంచాలని నిర్ణయించారు.


Also Read: ట్రంప్ పై హత్యాయత్నం.. దాడి తరువాత ఆయన ఏమన్నారంటే..

#america #donald-trump
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe