Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం.. కాల్పులు జరిపిన చోటే మళ్లీ!

తనపై కాల్పులు జరిగిన ప్రాంతంలోనే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఫైర్‌ఫైటర్‌ కోరే గౌరవార్థం కోసం పెన్సిల్వేనియాకు తిరిగి వెళ్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తానన్నారు.

New Update
Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం.. కాల్పులు జరిపిన చోటే మళ్లీ!

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తనపై కాల్పులు జరిగిన ప్రాంతం పెన్సిల్వేనియాలో మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించారు. ఈ మేరకు మా ప్రియమైన ఫైర్‌ఫైటర్‌ కోరే గౌరవార్థం ఆయనను స్మరించుకుంటూ నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహించబోతున్నానంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. అంతేకాదు ఈ ర్యాలీ కోసం పెన్సిల్వేనియాలోని బట్లర్‌కు తిరిగి వెళ్తున్నా. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తానంటూ స్పష్టం చేశాడు.

Advertisment
తాజా కథనాలు