Reaserch Study: తన్నులు తింటున్నారు కానీ తాగడం మాత్రం మానని భర్తలు...

దేశంలో భార్యల చేతిలో తన్నుల తింటున్న భర్తలు ఎక్కువ అవుతున్నారు. పలు కారణాలతో భార్యల చేతిలో మగవాళ్ళు బాగా దెబ్బలు తింటున్నారని చెబుతోంది బయో సోషల్ స్టడీస్ రీసెర్చ్ సంస్థ. ఇందులో తాగి తన్నులు తింటున్నవారే ఎక్కువ అని తెలిపింది.

New Update
Reaserch Study: తన్నులు తింటున్నారు కానీ తాగడం మాత్రం మానని భర్తలు...

Domestic Voilence On Husbands: డొమెస్టిక్ వయొలెన్స్ అంటే ఇంతకు ముందు వరకూ కేవలం భర్తలు భార్యలు కొట్టడం. కానీ ఇప్పుడు దీని డెఫినిషన్ మారిపోనుంది. ఎందుకంటే రోజు రోజుకూ భార్యల చేతిలో తన్నులు తింటున్న భర్తలు ఎక్కువైపోతున్నారుట. బయో సోషల్ స్టడీస్ అనే రీసెర్చ్ సంస్థలో ఈ విషయం బయటపడింది. వివిధ కారణాల చేత భార్యల చేతిలో భర్తలు దెబ్బలు తింటున్నారు. కానీ అందులో తాగితందనాలు అడుతున్న భర్తలే ఎక్కువగా ఉన్నారని చెబుతోంది రిసెర్చ్ సంస్థ. ఈ రీసెర్చ్‌ను కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రెస్ పబ్లిష్ చేసింది.

ఐదింతలుపెరిగాయి...

ఇండియాలో భార్య బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందట. 15ఏళ్ళల్లో దాదాపు ఐదింతలు వీరి సంఖ్య పెరిగిందని రీసెర్చ్‌లో తేలింది. ప్రతీ వెయ్యి మంది మహిళల్లో 36 మంది తమ భర్తలను చితగొడుతున్నారుట. ముందు ముందు ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. 2006లో ఈ నంబర్ కేవలం 7 మాత్రమే ఉండేదని...ఇప్పుడు 36కు పెరిగిందని ఆధారాలు చూపిస్తున్నారు. దీనికి కారణం ఇండియాలో డొమెస్టిక్ వయోలెన్స్ చట్టాలు ఆడవాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి. మగవాళ్ళకు ఉండవు. కానీ ఇప్పుడు మగవాళ్ళ కోసం చట్టాలు తేవాలని స్టడీలో సూచిస్తున్నారు.

కొట్టడానికి కారణాలు...

అయితే భార్యలు భర్తలను కొట్టడానికి కారణాలు ఉన్నాయని చెబుతోంది రిసెర్చ్ స్టడీ. ఎక్కువగా చదువుకోని వాళ్ళు, తాగుబోతులు అయిన భర్తలు మాత్రమే భార్యల చేతిలో దెబ్బుల తింటున్నారుట. రోజూ తాగి ఇబ్బంది పెడుతుంటేనే కొడుతున్నామని 18.4 మహిళలు చెబుతున్నారు. అప్పుడప్పుడు తాగి గొడవ చేసేవారిలో కేవలం 6.5 శాతం మంది తన్నులు తింటున్నారు. ఇక భర్తలు తమను కొడుతుంటే తాము తిరిగి కొడుతున్నామని అంటున్నారు 10.9 శాతం మహిళలు. ఇతర కారణాలతో 6.1 శాతం మంది మహిళలు భర్తల మీద చెయ్యి చేసుకుంటున్నారు.

గ్రామాల్లోనే ఎక్కువ...

ఇలా భర్తలను కొట్టే మహిళల సంఖ్య ఎక్కువగా పల్లెల్లోనే ఉంటోంది. అది కూడా 10 కన్నా తక్కువ చదువుకున్న వారే అధికంగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రతీ ఊరిలో బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు పెరిగిపోవడం కారణమని అంటున్నారు. ఇక ఇలా భర్తలను భార్యలు అత్యతంత ఎక్కువగా కొడుతున్నది కూడా తెలంగాణలోనే అంట. ఇక్కడ రకరకాల కారణాల వలన మద్యానికి బానిసలై భార్యాబిడ్డలను పట్టించుకోని మగవారు ఎక్కువయ్యారని...అందుకే మగవారిపై గృహహింస పెరిగిందని రీసెర్చ్ చెబుతోంది.

Also Read:Hyderabad : హైదరాబాద్‌లో డ్రగ్స్ సీజ్.. బీజేపీ నేత కొడుకు అరెస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు