Dollar vs Gold: డాలర్ vs బంగారం.. సీన్ రివర్స్.. బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే.. 

బంగారం, వెండి ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. డాలర్ విలువ పెరిగితే బంగారం విలువ తగ్గుతుంది. డాలర్ విలువ పడిపోతే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఇప్పుడు దానికి విరుద్ధంగా జరుగుతోంది. ఈ పరిస్థితిపై నిపుణులు ఏమి చెప్పారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. 

New Update
Dollar vs Gold: డాలర్ vs బంగారం.. సీన్ రివర్స్.. బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే.. 

బంగారం, వెండి ధరలు స్థిరంగా ఆల్ టైమ్ గరిష్టాలను దాటుతున్నాయి. ఊహించిన దానికంటే చాలా వేగంగా ధరలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమెరికా డాలర్ విలువ(Dollar vs Gold) కూడా పెరుగుతుండటం ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. ఎందుకంటే, సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధర తగ్గుతుంది. డాలర్ విలువ పడిపోతే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. ఇది మార్కెట్ లో కనిపించే సహజ ధోరణి. కానీ, ఇప్పుడు డాలర్ రేటు పెరుగుతోంది. దీంతో పాటు బంగారం ధర(Dollar vs Gold) కూడా పెరుగుతోంది. గత 10 రోజుల్లో గ్రాము బంగారం ధర బాగా పెరిగింది. ఈ అసాధారణ మార్కెట్ ధోరణికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు నిపుణులు చెబుతున్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం. 

బంగారం ధరలు పెరగడానికి ఇవే ప్రధాన కారణాలు: 

  1. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు త్వరలో ప్రారంభం కానుందని అంచనాలు 
  2. చైనా నుంచి భారీగా జరుగుతున్నా బంగారం కొనుగోళ్లు 
  3. గ్లోబల్ పాలిటిక్స్ (జియో పాలిటిక్స్) అనే సంక్షోభ స్థితి
  4. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఎన్నికలు
  5. భారత రూపాయి విలువ క్షీణత

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం, రష్యా-ఉక్రెయిన్ వివాదం మొదలైన ప్రపంచ రాజకీయ సున్నితమైన అంశాలు(Dollar vs Gold) ఒక విధంగా అనిశ్చిత వాతావరణాన్ని సృష్టించాయి. చమురు సంపన్న దేశాలు యుద్ధంలో పాల్గొనడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని పెట్టుబడిదారులు భయపడుతున్నారు. ఈ సందర్భంలో సురక్షితమైన పెట్టుబడి కోసం బంగారం, వెండి(Dollar vs Gold) మొదలైన అరుదైన లోహాలు బెటర్ అని ఇన్వెస్టర్స్ భావిస్తున్నారు. .

చైనా సెంట్రల్ బ్యాంక్ ఇటీవలి వారాల్లో బంగారం- వెండిని భారీగా కొనుగోలు చేస్తోంది. దీంతో బంగారం డిమాండ్ కూడా పెరిగింది.

Also Read: బంగారం ధర తగ్గుతుందనే ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈరోజు ఎంత ఉందంటే.. 

అంతేకాకుండా, US వ్యవసాయేతర చెల్లింపుల డేటా విడుదల ప్రభావం కూడా బంగారం ధరలపై ఉంది. ఈ డేటా ప్రకారం, అమెరికాలో నిరుద్యోగ రేటు 3.9 %. నుండి 3.8 శాతానికి తగ్గింది. ఆ తర్వాత బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరగడం ప్రారంభించాయి.

ఇక రాబోయే రెండు మూడు నెలల్లో అంతర్జాతీయంగా(Dollar vs Gold) చాలా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ప్రభావం కూడా బంగారం ధరలపై పడుతోంది. మరోవైపు మన రూపాయి విలువ కూడా తగ్గుతూ వస్తోంది. ఇది కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోంది. 

నిపుణుల అంచనాల ప్రకారం మరికొన్ని రోజులు బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేదా తగ్గుదల కనిపించే అవకాశం లేదు. అంటే, పసిడి ప్రియులకు ఇది చేదు వార్తగానే చెప్పుకోవాలి. 

Advertisment
తాజా కథనాలు