Dog Free Country: కుక్కలు లేని దేశం ఏదైనా ఉందా అంటే..ఇక నుంచి ఆ దేశం కూడా ఉండబోతుంది. ఆ దేశం టర్కీ...అవును ఇక నుంచి డాగ్ ఫ్రీ కంట్రీగా టర్కీ ప్రభుత్వం కొత్త చట్టం అమల్లోకి తీసుకుని వచ్చింది. మరి ఇప్పటి వరకు ఉన్న దేశంలో ఉన్న కుక్కలను ఏం చేయబోతున్నారు.. అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లక్షలాది వీధికుక్కలను పట్టి వాటిని షెల్టర్లలో పెట్టాలని టర్కీ పార్లమెంట్ మంగళవారం జులై 30, 2024న ఓ బిల్లును ప్రవేశపెట్టగా..దానిని పార్లమెంట్ ఆమోదించింది. టర్కీలో ఉన్న దాదాపు 4 మిలియన్ల కుక్కలను పట్టి షెల్టర్లకు తరలించాలని ఈ చట్టం ఉద్దేశం. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ పార్టీ ప్రతిపాదించిన చట్టం ప్రకారం.. మున్సిపాలిటీలు వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే కుక్కులను పట్టి షెల్టర్లలో పెట్టాల్సి ఉంటుంది. చికిత్స నయం చేయలేని వ్యాధులున్న కుక్కలను అధికారులు నిర్మూలించాలి. అయితే ఈ చట్టాన్ని జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేపడుతున్నారు.
Also read: వయనాడ్ ప్రకృతి ప్రకోపానికి కారణం మానవ తప్పిదమేనా?