Summer Tips: సూర్యరశ్మి కారణంగా చర్మం నల్లబడటం అనేది ఒక సాధారణ సమస్య. వేసవిలో దీంతో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. సూర్యరశ్మి కారణంగా చాలాసార్లు చర్మం ఎర్రగా మారి.. మంటను కలిగిస్తుంది. సూర్యరశ్మి వల్ల చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే బియ్యం పిండిని మంచి ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్యను వదిలించుకునే చిట్కాలు ఉన్నాయి. ఈ రోజు దీన్ని వర్తించే సరైన మార్గాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
సహజ ఇంటి నివారణలు:
బియ్యంపిండి అనేది సహజసిద్ధమైన హోం రెమెడీ. ఇది చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో బియ్యప్పిండి తీసుకుని అందులో కాస్త పెరుగు, తేనె వేసి చిక్కని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖం, మెడపై 15 నుంచి 20 నిమిషాల పాటు అప్లై చేయాలి. 20 నిమిషాలు ఆరని తర్వాత చల్లటి నీటితో కడగాలి.
బియ్యంపిండి స్క్రబ్:
బియ్యప్పిండితో స్క్రబ్ కూడా సిద్ధం చేసుకోవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో బియ్యప్పిండిని తీసుకుని.. కొంచెం శనగపిండి, కొంచెం పసుపు పొడి, రోజ్ వాట, పాలు వేసి చిక్కగా పేస్ట్ సిద్ధం చేయాలి. తడి ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసి 5 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి.
బియ్యం పిండి ఫేస్ ప్యాక్:
ఒక గిన్నెలో బియ్యపు పిండిని తీసుకుని అందులో అలోవెరా జెల్ మిక్స్ చేసి కొన్ని చుక్కల తేనె కలపాలి. ఈ మూడింటిని మిక్స్ చేసి పేస్ట్‌ను తయారు చేసి.. దానిని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించే ముందు.. ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఈ మూడు ఫేస్ ప్యాక్‌లను వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు. కొందరికి దీనివల్ల అలెర్జీ ఉండవచ్చు. అలా ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ సలహా తీసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: లిప్‌స్టిక్ వేసుకునే ముందు లిప్‌బామ్ అప్లై చేసుకోవచ్చా? అసలు మేటర్ ఇదే!