Salt Health Benefits, ఉప్పు తింటే షుగర్‌ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!!

ఉప్పు ఎక్కువగా తింటే అధికంగా బరువు పెరగుతారు. దీంతో పాటు బీపీ, గుండె జబ్బులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉప్పు మోతాదుకు మించితే టైప్‌-2 డయాబెటిస్‌ రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

Salt Health Benefits, ఉప్పు తింటే షుగర్‌ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!!
New Update

 eating salt cause sugar: సాధారణంగా ఉప్పు ఎక్కువ మోతాదులో వాడితే అధిక రక్తపోటు(బీపీ) వస్తుందని తెలుసు. కానీ ఉప్పు వల్ల డయాబెటిస్‌ కూడా వస్తుందంటున్నారు లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు. తాజాగా చేసిన కొన్ని అధ్యయనాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మోతాదుకు మించి ఉప్పు తింటే తప్పకుండా షుగర్‌ వచ్చే అవకాశం ఉందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే రోజూ ఎంత ఉప్పు తీసుకుంటే మంచిది, ఏ ఉప్పును తీసుకోవాలి, వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: కారు వెంట కుక్కలు ఎందుకు పరుగెత్తుతాయి?
ఉప్పులేని ఆ వంటను ఊహించలేం, ఏది వండుకున్నా కాస్త ఉప్పు తగిలిందంటేనే దానికి రుచి. ఇక ఊరగాయల్లో అయితే ఉప్పు గురించి వేరే చెప్పక్కర్లేదు, ఎక్కువ మొత్తంలో వేస్తూ ఉంటాం. మరికొందరికి అయితే అదే పనిగా భోజనం చేసేప్పుడు పక్కన ఉప్పు డబ్బా లేకపోతే ముద్ద దిగదు. మన శరీరానికి మించిన ఉప్పు తింటే రక్తపోటు అధికం అవుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా షుగర్‌ కూడా వస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు ఎక్కువ తీసుకుంటే టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. లండన్‌లోని తులనే వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన రీసెర్చ్‌లో అనేక షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 12 సంవత్సరాల పాటు 13 వేల మందిపై ఈ పరిశోధనలు చేశారు. ఉప్పు మోతాదుకు మించితే టైప్‌-2 డయాబెటిస్‌ రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ప్రతిరోజు వ్యాయామం చేయాలి
అప్పుడప్పుడు ఉప్పు ఎక్కువగా తినేవారిలో 13శాతం, మామూలుగా తినేవారిలో 20శాతం, ఎప్పుడూ తీసుకునేవాళ్లలో 39శాతం డయాబెటిస్‌ వచ్చినట్టు పరిశోధనల్లో తేలింది. అందుకే ఉప్పు తక్కువగా తింటే బీపీతో పాటు షుగర్‌ వచ్చే అవకాశాలు కూడా బాగా తగ్గుతాయని అంటున్నారు. భోజనం చేసేప్పుడు డైరెక్ట్‌గా ఉప్పు తీసుకోవడం వల్ల టైప్‌-2 షుగర్‌ 40శాతం వరకు పెరిగే చాన్స్‌ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. షుగర్‌ బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజు 6 గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పును తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. అధికంగా ఉప్పును వాడటం వల్ల బరువు పెరగడమేకాక బీపీ, మధుమేహం, గుండె జబ్బులు వస్తాయని అంటున్నారు. ఎక్కువ శాతం ఉప్పు బ్రెడ్‌, చీజ్‌, హామ్‌, సాస్‌, స్నాక్స్‌ వల్ల వస్తోందని, అందుకే ఆహారంలో ప్రత్యేకంగా ఉప్పును వేసుకోవడం చేయొద్దని సూచిస్తున్నారు. టైప్‌-2 డయాబెటిస్‌ రాకుండా ఉండాలంటే సాధాసీదా ఫుడ్‌ తీసుకుంటూ ప్రతిరోజు వ్యాయామం చేయాలని, అంతేకాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

#health-benefits #eating-salt
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe