/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Doctors-do-not-forget-to-eat-this-fruit-jpg.webp)
Rama Phalam Benefits: ప్రకృతిలో మనకు రకరకాల పండ్లు లభిస్తుంటాయి. కాలానుగుణంగా లభించే పండ్లలో రామఫలం ఒకటి. ఈ ఫలం ఎక్కువగా చలికాలంలో లభిస్తాయి. రామఫలం చూడటానికి ఎర్రగా సీతాఫలం పండులానే ఉంటుంది. దీని రుచి ఎంతో బాగుంటుంది. ఎక్కువ మంది ఈ పండును ఇష్టంగా తింటారు. అయితే.. మనకు ఎక్కువగా అడవుల్లో మాత్రమే ఈ రామఫలం దొరుకుతుంది. అడవుల నుంచి సేకరించి వీటిని పట్టణాల్లో విరివిగా అమ్ముతుంటారు. సీతాఫలంలా రామఫలాన్ని మనం తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. రామఫలంలో కూడా అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. దీనిని తింటే మనం మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. రామ ఫలాన్ని తీసుకుంటే మనకి కలిగే ప్రయోజనాలు, వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రామఫలాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు
రామఫలాన్ని తింటే మన చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గిపోతాయి. మొటిమలతో ఇబ్బంది పడేవారు ఈ పండును తింటే మొటిమలు తొలగిపోతాయని, అంతేకాకుండా చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఈ ఫలం కాపాడుతుంది. అంతేకాకుండా మన ముఖంలో అందం మరింత పెరుగుతుంది. వీటితో పాటు మధుమేహంతో బాధపడుతున్న వారు ఈ పండు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌తో ఇబ్బంది పడేవాళ్లు ఈ పండు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని వీటికి దూరం పెడుతారు. కానీ ఈ రామఫలాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని వైద్యులు అంటున్నారు.
Also Read: లూజ్ డ్రెస్సెస్ ఇప్పుడు ఫ్యాషన్ బాసూ.. ఈ బట్టలతో ఎంతో ఆరోగ్యం కూడా!
అందుకే ఈ రామఫలం డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ఈ పండును తింటే శరీరంలో రోగ నిరోధకశక్తి బాగా పెరుగుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి మనల్ని శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. రామఫలంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. దీనిని తింటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. మన శరీరంలో ఉండే ప్రీరాడికల్ కణాల నుంచి మనల్ని ఈ ఫలం కాపాడుతుంది. అంతేకాకుండా రామఫలం తింటే గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. శరీరంలో ఎక్కువగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారికి కూడా ఈ పండు ఎంతో మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. కాలానుగుణంగా వచ్చే ఏ పండు అయినా మన ఆరోగ్యానికి మంచిది. రామఫలం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండు దొరికితే కచ్చితంగా తినాలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా కాలానుగుణంగా వచ్చే అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వదని అంటున్నారు.