Doctor Negligence: ఓ మహిళ చాలా కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఎక్స్‌రేలో మూత్రాశయంలో రాయి ఉందని, ఆ రాయి వలన ఒక కిడ్నీ పూర్తిగా పాడైందని, వెంటనే ఆ కిడ్నీని తొలగించాలని డాక్టర్ చెప్పారు. వెంటనే ఆమెను హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకుని.. ఆ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత పాడైన కిడ్నీని తీసేయడానికి బదులు.. చక్కగా ఉన్న కిడ్నీ తొలగించారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రోగి తరఫు బంధువులు ఈ విషయంపై డాక్టర్ పై ఆరోపణలు చేశారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కానీ డాక్టర్ ఈ ఆరోపణను తోసిపుచ్చారు. ఆపరేషన్ కరెక్ట్ గానే జరిగిందని చెప్పారు. సర్జరీ చేసిన డాక్టర్ సంజయ్ ధంఖర్ నిర్వహిస్తున్న ధంఖర్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.
రెండురోజుల తరువాత..
Doctor Negligence: రోగి బంధువులు ఆరోపణలు చేసిన రెండు రోజుల తర్వాత, ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఆమెను మళ్లీ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ డాక్టర్ ధంఖర్ ఆమెను చికిత్స కోసం జైపూర్ తీసుకువెళ్లాలని సూచించాడు.ఆ డాక్టర్ నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వెలుబుచ్చారు. ఆ సమయంలో డాక్టర్ వేరే చోట ట్రీట్మెంట్ చేయించుకోమని.. దానికి అవసరమైన డబ్బు తానూ ఇస్తాననీ ఆఫర్ ఇచ్చాడు. దీంతో బాధితురాలి కుటుంబం అతని ప్రతిపాదనను తిరస్కరించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: 8 రోజుల క్రితం పెళ్లి..8 మందిని చంపి ..తాను కూడా చచ్చాడు!
Doctor Negligence: బాధితురాలి భర్త షబ్బీర్ మాట్లాడుతూ డాక్టర్ ధంఖర్ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ రాజ్‌కుమార్ డాంగి ఐదుగురు వైద్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రి రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Doctor Negligence: మొదట డా. ధంఖర్ జుంజులోని BDK ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జన్‌గా పనిచేశేవాడు. అక్కడ ఓ మహిళ చనిపోవడంతో సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత 2020లో చురు జిల్లాకు అసైన్డ్ అయ్యాడు కానీ, సర్వీసుకు రాకుండా ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు కిడ్నీ సంఘటన అతని సొంత ఆసుపత్రిలోనే చోటుచేసుకుంది