Nellore: నెల్లూరు జిల్లాలోని జిజిహెచ్ హాస్పిటల్ లో విషాదం చోటుచేసుకుంది. ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ నాలుగో అంతస్తు నుంచి దూకి జ్యోతి అనే డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు చేజర్ల మండలం చిత్తలూరు పిహెచ్ సిలో మెడికల్ ఆఫీసర్ గా ఆమె పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మెడికల్ కాలేజీలో జరుగుతున్న క్యాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు వచ్చిన డాక్టర్ జ్యోతి మధ్యాహ్నం లంచ్ టైమ్ లో బిల్డింగ్ పై నుంచి దూకి దారుణానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆమెను గమనించిన తోటి వైద్యులు అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జ్యోతి భర్త కూడా వైద్యుడే. ఏవీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీలో జ్యోతి భర్త రవిబాబు ఎముకల డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జ్యోతి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని అనుమానాలు వ్యక్తమవుతుండగా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.