Airplane Colour: విమానం రంగు ఎందుకు తెల్లగానే ఎందుకు ఉంటుంది? కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.. వేసవిలో తెల్లని దుస్తులు ధరించి బయటకు వెళ్తే.. ఎండ వేడిమి సమస్య కాస్త తగ్గుతుంది. ఎందుకంటే.. తెలుపు రంగు సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అదే నలుపు రంగు దుస్తులు వేసుకుంటే.. ఒళ్లు కాలిపోవడం ఖాయం. నలుపు రంగా మిగతా రంగులు నలుపు రంగును శోశిస్తాయి. ఈ లాజిక్ విమానం విషయంలోనూ వర్తిస్తుంది. తెల్లటి రంగులో ఉండే విమానం.. దానిపై పడే సూర్య కరిణాలను చాలా వరకు ప్రతిబింబింపజేస్తుంది. ఇది విమానం వేడిని తగ్గిస్తుంది. ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచుతుంది. By Shiva.K 08 Oct 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Facts About Airplane Colour: మనం నిత్యం ఎన్నో రకాల విమానాలను చూస్తుంటాం. వాహనాలకు రంగులు ఉన్నట్లుగానే.. విమానాలకూ(Airplane Colour) రంగులు వేస్తారు. అయితే, పూర్తిగా ఒకే రంగు విమానాలకు వేయరు. దాదాపు అన్ని విమానాలు వైట్ కలర్లోనే ఉంటాయి. మరి విమానాలకు వైట్ కలర్ ఎందుకు వేస్తారు? ఆ కలర్లోనే విమానాలు ఎందుకు ఉంటాయి? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆసలు విమానాలు వేరే రంగులో ఎందుకు తయారు చేయలేరు అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందని చెబుతున్నారు నిపుణులు. వాస్తవానికి తెలుపు రంగు సూర్య కాంతిని, దాని వేడిని ప్రతిబింబింపజేస్తుంది. వేసవిలో తెల్లని దుస్తులు ధరించి బయటకు వెళ్తే.. ఎండ వేడిమి సమస్య కాస్త తగ్గుతుంది. ఎందుకంటే.. తెలుపు రంగు సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అదే నలుపు రంగు దుస్తులు వేసుకుంటే.. ఒళ్లు కాలిపోవడం ఖాయం. నలుపు రంగా మిగతా రంగులు నలుపు రంగును శోశిస్తాయి. ఈ లాజిక్ విమానం విషయంలోనూ వర్తిస్తుంది. తెల్లటి రంగులో ఉండే విమానం.. దానిపై పడే సూర్య కరిణాలను చాలా వరకు ప్రతిబింబింపజేస్తుంది. ఇది విమానం వేడిని తగ్గిస్తుంది. ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచుతుంది. ఇదీ కూడా కారణం.. విమానాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇందులో చిన్న సమస్య ఉన్నా.. దాని పరిణామాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అలాంటి పరిస్థితిలో విమానంలో ఏమాత్రం చిన్న డ్యామేజ్, డెంట్ను గుర్తించి దాన్ని పరిష్కరించడం చాలా ముఖ్యం. ఇతర రంగులతో పోలిస్తే తెలుపు రంగులో డెంట్లు సులభంగా కనిపిస్తాయి. విమానాల రూపకల్పనలో కంపెనీలు తెలుపు రంగుకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం. తెలుపు రంగు కాంతి.. తెలుపు రంగును తేలికైన రంగు అంటారు. ఇతర రంగుల కంటే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఇదే కారణం. ఇది కాకుండా.. దాని దృశ్యమానత కూడా స్పష్టంగా ఉంది. ఈ రంగు చీకటిలో కూడా సులభంగా కనిపిస్తుంది. ఇది వైమానిక ప్రమాదం సంభవించే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇక ఇది ఎప్పటికీ షేడ్ అవ్వదు. Also Read: TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త రవితేజకు సారీ చెప్పిన బాలీవుడ్ నటుడు.. అసలు ఏం అయిదంటే..? #trending-news #airplane #knowledge #colour-of-airplane #viral-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి