Millets: వేసవిలోఈ మిల్లెట్స్ తింటున్నారా అయితే జాగ్రత్త..!

చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వాటి ప్రయోజనాలు గురించి చాలా మందికి తెలియక చిరుధాన్యాలు పక్కన పెట్టేస్తారు. కానీ వాటిని ఎప్పుడు ఎలా తినాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి.

New Update
Millets: వేసవిలోఈ మిల్లెట్స్ తింటున్నారా అయితే జాగ్రత్త..!

Millets To Eat During The Summer: కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాది మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించింది. దీని మీద స్టాంప్ కూడా విడుదల చేసింది. రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, కొర్రలు వంటివి చిరుధాన్యాల కిందకి వస్తాయి. పూర్వం వరి అన్నం కాకుండా మిల్లెట్స్ తినేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు. మళ్ళీ ఇప్పుడిప్పుడే చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రతిరోజు మిల్లెట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మెనోపాజ్ తర్వాత గుండె జబ్బులతో పోరాడటానికి మహిళలకు ఇవి సహాయపడతాయి. శరీరంలో అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రించవచ్చు. పిత్తాశయంలో రాళ్ళతో బాధపడే వాళ్ళు వాటిని పోగొట్టుకోవాలని అనుకుంటే మిల్లెట్స్ చక్కని ఆహారం. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇవి గ్లూటెన్ ఫ్రీ. చిరుధాన్యాలు తినడం వల్ల కొంతమందికి ఆరోగ్యకరమే కానీ మరికొంతమందికి తీవ్ర సమస్యలు తీసుకొస్తాయి. అందుకే మొదటి సారి మీరు మిల్లెట్స్ తీసుకోవాలని అనుకుంటే కొద్ది కొద్దిగా తినాలి. ఎసిడిటీ లేదా ఉబ్బరం వంటి సంకేతాలు కనిపిస్తే వాటిని తినకపోవడం మంచిది.మిల్లెట్స్ ఉడికించుకుని తినడం మంచిది. జీర్ణం చేయడం కూడా సులభంగా ఉంటుంది. జోవర్, బజ్రా ముందుగా కాకుండా కోడో వంటి ధాన్యాలతో ప్రారంభించడం ఉత్తమం.

Also Read: మరోసారి డీప్ ఫేక్ బారిన పడ్డ రష్మిక మందన.. వైరల్ అవుతున్న బికినీ వీడియో !

మిల్లెట్స్ అందరి శరీరానికి నప్పుతాయని అనుకుంటారు. కానీ అవి తింటే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మిల్లెట్స్ తిన్న తర్వాత మీకు కడుపులో ఎటువంటి అసౌకర్యం లేకపోతే తినవచ్చు. కిచిడీ, రోటీలాగా చేసుకుని తినడం ఉత్తమం. మిల్లెట్స్ ఏ టైమ్ లో తింటే మంచిదనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళ తీసుకోవచ్చు. కానీ మితంగా మాత్రమే తీసుకోవడం ఉత్తమం. వారానికి మూడు లేదా నాలుగు సార్లు తినవచ్చు. హైపోథైరాయిడిజం ఉన్నవారికి మాత్రం ఇది వర్తించదు.

థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు మిల్లెట్స్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది థైరాయిడ్ పెరుగుదలకు దారి తీస్తుంది. అయోడిన్ శోషణకు ఆటంకం కలిగించే గోయిట్రోజెన్ లు ఉంటాయి. ఇవి ఇబ్బంది కలిగిస్తాయి. మిల్లెట్స్ తినేటప్పుడు నీరు బాగా తాగాలి.బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తీసుకుంటే మంచిది. వాతావరణం ప్రకారం మిల్లెట్స్ ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నరు.

Advertisment
Advertisment
తాజా కథనాలు