ప్రపంచంలో అత్యధిక బంగారం కలిగి ఉన్న అమెరికా? ప్రపంచంలో అత్యధికంగా బంగారు నిల్వలు ఉన్న దేశాల జాబితా ఇటీవలే X లోప్రచురితమైంది.మొదటి 10 స్థానాల్లో USA, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్, ఇండియా, నెదర్లాండ్స్ ఉన్నాయి.రీసెంట్ గా ఆర్బీఐ బ్రిటన్ నుంచి 100 టన్నుల బంగారాన్ని భారత్ కు తెచ్చింది. By Durga Rao 05 Jul 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల బ్రిటన్ నుండి 100 టన్నుల బంగారాన్ని దేశానికి తీసుకువచ్చింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి, బంగారం మళ్లీ చర్చలోకి వచ్చింది. బంగారం నిల్వలు ప్రతి దేశానికి ముఖ్యమైన ఆస్తి. ఎందుకంటే ఆర్థిక సంక్షోభ సమయంలో దేశాన్ని రక్షించడానికి ఇది సహాయపడుతుంది. ప్రతి దేశం ఆర్థిక బలాన్ని నిర్ధారించడంలో బంగారు నిల్వలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితా ఇటీవలే X పేజీలో ప్రచురించబడింది. ఈ జాబితాలో మొదటి 10 స్థానాల్లో USA, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్, ఇండియా నెదర్లాండ్స్ ఉన్నాయి. Gold reserves (tonnes) 🇺🇸 US: 8133 🇩🇪 Germany: 3353 🇮🇹 Italy: 2452 🇫🇷 France: 2437 🇷🇺 Russia: 2333 🇨🇳 China: 2265 🇨🇭 Switzerland: 1040 🇯🇵 Japan: 846 🇮🇳 India: 804 🇳🇱 Netherlands: 612 🇹🇷 Turkey: 540 🇹🇼 Taiwan: 424 🇵🇹 Portugal: 383 🇺🇿 Uzbekistan: 371 🇵🇱 Poland: 359 🇸🇦 Saudi: 323 — World of Statistics (@stats_feed) June 30, 2024 8,133 టన్నుల బంగారం నిల్వలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. జర్మనీలో 3,353 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ విభాగంలో జర్మనీ రెండో స్థానంలో ఉంది. 2,452 టన్నుల బంగారం నిల్వలతో ఇటలీ మూడో స్థానంలో ఉంది. 2,437 టన్నుల బంగారం నిల్వలతో ఫ్రాన్స్ 4వ స్థానంలో, 2,333 టన్నుల బంగారం నిల్వలతో రష్యా 5వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 804 టన్నుల బంగారం నిల్వలతో 9వ స్థానంలో ఉంది. #gold మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి