PM Kisan Samman Nidhi : రైతులకు అదిరిపోయే వార్త...బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు..!!

రైతులకు శుభవార్త. త్వరలోనే అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. ఏ డబ్బులు..ఎంత వస్తున్నాయి? అని ఆలోచిస్తున్నారా?అయితే ఈ విషయం తెలుసుకునేందుకు కచ్చితంగా ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

New Update
PM Modi: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. నెలకు రూ.3 వేల పెన్షన్!

PM Kisan Samman Nidhi : రైతులకు(Farmers) అదిరిపోయే వార్త చెప్పింది కేంద్రంలోకి మోదీ సర్కార్(Modi Sarkar). అకౌంట్లోకి డబ్బులు రానున్నాయి. దీని వల్ల చాలా మందికి ఊరట లభించనుంది. ఇంతకీ ఏ డబ్బులు.. ఎక్కడి నుంచి వస్తాయి.. ఇదే కదా మీ డౌట్. అక్కడికే వెళ్తున్నాం.

కేంద్రంలోని మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan Samman Nidhi Yojana) స్కీంను తీసుకువచ్చింది. ఈ పీఎం కిసాన్ స్కీమ్(PM Kisan Scheme) ను మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ రైతులకు అందిస్తుంది. ఈ స్కీం కింద నేరుగా రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ అవుతున్నాయి. ప్రతి ఏడాది రూ. 6వేలు రైతుల బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ అవుతున్నాయి. అయితే రూ. 6వేల మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల బ్యాంకు అకౌంట్లో పడుతున్నాయి. మూడు విడతల్లో రూ. 2వేల చొప్పున ఈ డబ్బులు వస్తున్నాయి. అంటే 4 నెలలకు ఒకసారి ఈ మొత్తం వస్తున్నాయి. ఇప్పటివరకు భారత ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీం కింద 15 విడదల డబ్బులను రైతుల బ్యాంకు అకౌంట్లో(Bank Account) కి జమ చేసింది. అంటే మొత్తంగా అన్నదాతలకు రూ. 30వేలు వచ్చాయని చెప్పవచ్చు.

అయితే ఇప్పుడు మరో విడత డబ్బులు జమకావాల్సి ఉంది. అంటే 16వ విడత డబ్బులు రిలీజ్ చేయాని ప్రభుత్వం భావిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే జరిగే రైతులు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. మోదీ సర్కార్(Modi Sarkar) ఈ నెలలో అంటే ఫిబ్రవరిలో పీఎం కిసాన్ 16వ విడత డబ్బులను విడుదల చేయనుందని పేర్కొంటున్నాయి. అయితే కేంద్రం మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రానుంది.

ఇక రైతులు ఇకేవైసీ(E-KYC) పూర్తి చేసుకోవాలి. అప్పుడే పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో జమ అవుతాయి. ఒకవేళ ఇకేవైసీ చేసుకోకపోతే డబ్బులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. మీరు ఇకేవైసీ పూర్తి చేయకుంటే వెంటనే చేసుకోండి. తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ లేకుంటే రేవంత్ సీఎం అయ్యేవాడా?.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు