మీకు పాము ఎదురైతే ఏం చేయాలో తెలుసా?

ప్రపంచంలో అత్యంత విషపూరితమైన వాటిలో పాము ఒకటి.అయితే పాము మనకు అనుకోని సందర్భంలో ఎదురైతే మనం భయంతో దాని కాటుకు గురవుతుంటాము.కానీ ఆ సమయంలో కొద్దిగా తెలివిగా వ్యవహరిస్తే దాని నుంచి ఇట్టే తప్పించుకోవచ్చు.అది ఎలానో ఈ పోస్ట్ లో చూద్దాం.

New Update
మీకు పాము ఎదురైతే ఏం చేయాలో తెలుసా?

పామును చూసి మొదట భయపడకూడదు. పాము వస్తున్న దిశలో కదలికలు చేయవద్దు. పాము ఉన్న దిశలో పరుగెత్తటం కానీ పాముపై ఏదైనా విసిరేందుకు ప్రయత్నించకూడదు. చాలా పాములు మనుషుల దగ్గరికి రావడానికి ఇష్టపడవు.మనం వాటిని ఇబ్బంది పెట్టకపోతే వాటంతట అవే వెళ్లిపోతాయి.

మన ఇంట్లో పాము ఉన్నట్లు తెలస్తే ముందుగా మనం ప్రశాంతంగా ఉండాలి. ఆ తర్వాత చిన్నపిల్లలను, పెంపుడు జంతువులను  పాము దగ్గరకీ రానివ్వకూడదు. ఆ సమయంలో  పాము ఏ దిశలో వెళ్తుందో  ఓ కన్నేసి ఉంచాలి అలాగే పాముని భయపెట్టే పని ఏది చేయకూడదు.ఒక వేళ మీరు దానిపై హాని చేయాలని చూస్తే అది మీ పై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాము ఉన్న దిశ నుండి వేరే దిశలో వెళ్ళండి. సహాయం కోసం ఎవరినైనా పిలవండి.

ఒక పొడవాటి కర్రను తీసుకుని, పాము మీ వైపు రాకుండా ఉండేందుకు దాన్ని కింద కొట్టండి. పాముకి చెవులు లేవు ఉండవు కాబట్టి,నేల ప్రకంపనలకు అది అక్కడి నుంచి పారిపోతుంది. మీరు ఏదైనా ఇతర గదికి వెళితే, దాన్ని మూసివేసి, సహాయం కోసం ఇతరులకు కాల్ చేయండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు