Health Tips: 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతే డేంజర్.. ఏమవుతుందో తెలుసా?

New Update
Health Tips: 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతే డేంజర్.. ఏమవుతుందో తెలుసా?

నిద్ర మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ చింతనలన్నింటినీ దూరం చేస్తుంది. జీవితంలో ఎన్ని సమస్యలున్నా మంచి నిద్రతో వాటిని పరిష్కరించుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో చాలా మంది అర్థరాత్రి దాటినా మొబైల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు, సీరియల్స్ చూస్తూనే గడిపేస్తున్నారు. ఫలితంగా చాలా మంది రోజు 7గంటలు కూడా కనీసం నిద్రించడం లేదు. సరిగ్గా నిద్రపోకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మందికి తెలుసు. అయినప్పటికీ ఎవరూ పాటించడం లేదు.

ఏడు గంటల నిద్ర ఎందుకు అవసరమంటే నిద్ర మన శరీరంలోని అనేక సమస్యలను సరిచేస్తుంది. మిమ్మల్ని తాజాగా ఉంటుంది. మన జ్ఞాన సామర్థ్యానికి, జ్ఞాపకాలను ఏకీకృతం చేస్తుంది. సమస్యలను పరిష్కరించడానికి మంచి నిద్ర చాలా అవసరం. అంతేకాదు నిద్ర మీ మెదడుకు శక్తిని అందిస్తుంది. మీ రోగనిరోధక వ్యవస్థను బాగా పనిచేసేలా చేస్తుంది. అంతేకాదు 7గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల మీ రోగనిరోధకశక్తి బలహీనపడుతుంది. సరిగ్గా నిద్రపోకపోతే చిరాకు, కోపం, ఒత్తిడికి లోనవుతుంటారు.

మీరు ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోతే మీకు నిద్రరాదు. ఫలితంగా ఉదయం అలసటతో మేల్కోంటారు. ఈ అలసట రోజంతా ఉంటుంది. దీనివల్ల ఏ పనిపై శ్రద్ధ చూపించలేరు. మీ శరీరానికి కావాల్సినంత విశ్రాంతి లేనట్లయితే మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు.

అలసట:
నిద్ర మన శరీర బరువుతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. తగినంతనిద్ర లేనట్లయితే మీ శరీరంలో రెండు ముఖ్యమైన హార్మోన్లు, జెరెలిన్, లెఫ్టిన్ లు సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. మీరు రాత్రిపూట తగినంత నిద్రపోనట్లయితే కెర్నల్ స్థాయి పెరుగుతుంది. మరింత ఆకలిగా అనిపిస్తుంది. లెప్టిన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా ఎక్కువ కేలరీలు, చక్కెరలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. చివరికి మీరు బరువు పెరుగుతారు.

ఇమ్యూనిటీ తగ్గడం:
మీ రోగనిరోధకవ్యవస్థ బాగా పనిచేయడానికి మంచి నిద్ర చాలా అవసరం. రాత్రిపూట గాఢ నిద్రలో మన శరీరం సైటోకిన్ లను ఉత్పత్తిచేస్తుంది. ఇది మన శరీరానికి చాలా అవసరం. అంటువ్యాధులతో పోరాడటంలో కీలకపాత్ర పోషిస్తుంది. మీరు 7గంటల కంటే తక్కువ నిద్రపోతే...ఈ సైటోకిన్లు సరైన మొత్తంలో ఉత్పత్తికాలేవు. దీనివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి జ్వరం, దగ్గు మొదలైనవి ఇబ్బంది పెడుతుంటాయి.

మానసిక ఆరోగ్య సమస్యలు:
సమయానికి నిద్రపోకపోవడం వల్ల మీ భావోద్వేగాలు నియంత్రణలో ఉండవు. మానసిక స్థితి మారుతుంది. కోపం, చికాకు వస్తాయి. ఇది మనస్సుపై ఒత్తిడి తెస్తుంది. కాబట్టి సరైన నిద్ర లేకపోతే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవు.

ఇది కూడా చదవండి:  రక్తాలు కారేలా తన్నుకున్న బీఆర్ఎస్ నేతలు..కేటీఆర్ రోడ్ షోలో ఘటన..!!

Advertisment
తాజా కథనాలు