Tea : నెల రోజులు చాయ్ తాగకుండా ఉంటే ఏమౌతుందో తెలుసా..? ఉదయం లేవగానే చాయ్ తాగాల్సిందే. చాయ్ తాగకుంటే ఏ పని చేయాలనిపించదు. కొంతమంది చాయ్ తాగకుంటే ఏదో కోల్పోయమన్న భావనలో ఉంటారు. ఇంకొంతమంది అయితే రోజు నాలుగు ఐదు సార్లు చాయ్ తాగుతుంటారు. ఇలాంటివారు ఒక నెలరోజులపాటు చాయ్ తాగకుండా ఉంటే...ఏమౌతుంది. వారి శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి. టీ తాగకుండా ఒక్కరోజే ఉండలేము..నెలరోజులు ఎలా ఉంటామని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. By Bhoomi 30 Aug 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health Benefits : మనలో చాలా మందికి ఉదయం లేవగానే కప్పు చాయ్ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు లెక్కలేనన్ని సార్లు చాయ్ తాగుతుంటారు. కొంతమంది పని ఒత్తిడిలో అలసిపోయి ప్రశాంతత కోసం చాయ్ తాగుతారు. టీ తాగడం వల్ల లాభాలు ఉన్నాయి..నష్టాలు ఉన్నాయి. రోజుకు ఒకసారి టీ తాగడం వల్ల ఎలాంటి హాని కలగదు. కానీ రోజులో చాలా సార్లు టీ తాగేవారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఆ సంగతి పక్కన పెడితే..ఒక నెల రోజులపాటు టీ తాగకుండా ఉంటే..శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఒక నెలరోజులు టీ తాగకుండా ఉంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ప్రముఖ డైటీషియన్ రిచా ఆనంద్. ఎందుకంటే టీలో కెఫిన్ ఉంటుంది. ఇది శరీరానికి హాని కలిగిస్తుంది. ఎప్పుడైతే కెఫిన్ తీసుకోవడం తగ్గిస్తామో ..అప్పుడు శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. మెరుగైన నిద్ర, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. అంతేకాదు టీని తాగడం మానేస్తే డీహైడ్రేషన్ సమస్యలకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు. ఇది కూడా చదవండి: కెవ్వు కేక..రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి త్వరలో 4 కొత్త బైకులు..!! అదేవిధంగా పూణేలోని రూబీ హాల్ క్లినిక్ పోషకాహార నిపుణులు, చీఫ్ డైటీషియన్ డాక్టర్ కమల్ పాలియా తెలిపిన వివరాల ప్రకారం టీ తాగడం మానేస్తే...శరీరంలో ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయని..తద్వారా సెల్యూలార్ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చని వెల్లడించారు. అంతేకాదు ఇది జీర్ణ సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుంది. అయితే ఉన్నఫలంగా టీ తాగడం మానేస్తే పలు సమస్యలను ఎదుర్కొవల్సి ఉంటుందని తెలిపారు. కొంతమంది ప్రశాంతత, విశ్రాంతి కోసం టీ తాగుతుంటారు. అలాంటి వారు ఒక్కసారిగా టీ తాగడం మానేస్తే...వారిలో ఏదో తెలియని ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక మార్పులు దారి తీసే అవకాశం ఉంటుంది. టీకి ప్రత్యామ్నాయాలు: మీరు టీ తాగడం మానుకుంటే...దానికి ప్రత్యామ్నాయంగా మూలికా కషాయాలు, పండ్ల రసాలు, వేడినీళ్లు వంటి చేర్చుకోవచ్చని చెబుతున్నారు. చమోమిలే లేదా పెప్పర్ వంటి మూలికా కషాయాలు తాగడం మంచిదంటున్నారు. ఇవి రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పండ్ల రసాల్లో ముఖ్యంగా యాపిల్ లేదా కాన్ బ్రెరీ వంటి జ్యూసులు తీసుకోవడం మంచిది. నిమ్మకాయ లేదా తేనె కలిపిన నీళ్లను తాగినట్లయితే...టీ యొక్క అనుభూతిని పొందవచ్చని చెబుతున్నారు. జీర్ణక్రియ, యాసిడ్ రిప్లెక్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి టీలో ఉండే కెఫిన్ సమస్యను మరింత తీవ్రం చేస్తుందని పేర్కొన్నారు. గర్బిణీలు లేదా పాలిచ్చే స్త్రీలు కూడా కెఫిన్ తగ్గించడం మంచిది. ఎందుకంటే వీటి అధిక వినియోగం పిండం అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఐరన్ లోపం, ఆందోళన రుగ్మతులు, గుండె అరిథ్మియా వంటి వ్యాధులు ఉన్నవారు టీకి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: రైల్వేలో 2409 ఖాళీలకు నోటిఫికేషన్…పది పాసైతే చాలు..వెంటనే అప్లయ్ చేసుకోండి..!! #health-benefits #tea-benefits #lifestyle మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి