Science Reason: భయం వేసినప్పుడు మన శరీరంలో ఏయే మార్పులు జరుగుతాయో తెలుసా? భయం అనేది మానసిక, శారీరక నిర్మాణాన్ని ప్రభావితం చేసే ఒక సహజమైన స్థితి. ఒక వ్యక్తి భయపడినప్పుడు, శరీరంలో కొన్ని రకాల హార్మోన్లు, రసాయన మూలకాలు విడుదలవుతాయి. వీటిల్లో కార్టిసాల్, ఎపినెఫ్రైన్, కాల్షియం లాంటి హార్మోన్లు ఉంటాయి. ఇవి భయానికి సంబంధించిన హార్మోన్లు. By Vijaya Nimma 28 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Science Reason: మనలో భయం అనేది మానసిక, శారీరక నిర్మాణాన్ని ప్రభావితం చేసే ఒక సహజమైన స్థితి. అసాధారణ సందర్భాల్లో ప్రతీ ఒక్కరికీ భయం కలుగుతుంది. అయితే.. ఇది ఏదైనా ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉందని తెలిసినప్పుడు మనస్సుకు తెలియజేసే ఒక సంకేతం. అయితే.. ఈ భయానికి ప్రధాని కారణం మన మెదడులోనే ఉందని సైన్స్ అంటుంది. జీవితంలో ఎదుర్కొనే వివిధ సవాళ్లు, సంఘటనల మూలంగా భయం ఎక్కువగా వేస్తుంది. నిజానికి భయం వివిధ కారణాల వల్ల పుడుతుంది. కాగా భయం వేసినప్పుడు మనలో కలిగే మార్పులు ఇవే. ఇప్పుడు భయానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భయం వల్ల మరణం: అధికంగా భయపడినప్పుడు గుండెపోటు, ఇతర సమస్యలు చాలా సందర్భాలల్లో సంభవించవచ్చు. దీని ఫలితంగా మరణం సంభవిస్తాయి. భయం ఎక్కువైనప్పుడు శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ అనే పరిమాణం పెరిగి మెదడు నుంచి బలమైన వేవ్ రూపంలో విడుదల చేస్తుంది. ఇలా భయం అయినప్పుడు మన శరీరాన్ని పోరాటం, విశ్రాంతి మోడ్‌లోకి తీసుకుంటుంది. దీని కారణంగా గుండె కొట్టుకోవడం పెరుగుతోంది. అంతేకాదు కళ్లలోని నరాలు వ్యాకోచిస్తాయి.. కండరాలలో రక్త ప్రవాహం వేగంగా పెరిగి శరీరం బిగుతుగా మారుతుంది. ఇలా శరీరంలో ఇవన్నీ ఎక్కువై గుండె విఫలమయ్యి ప్రాణం పోతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం: అయితే.. ఈ భయం మనసునే కాదు శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుందని సైన్స్ చెబుతోంది. అందుకే.. భయం వేసినప్పుడు గుండె వేగంగా కొట్టుకుని. శ్వాసను వేగవంతం చేసి మెదడును అలర్ట్ మోడ్‌లో ఉంచుతుంది. వ్యక్తిగత స్థాయిలో, సాంప్రదాయ, మానసిక అనుభవాల ఆధారంగా చాలాసార్లు ఈ భయం సంభవిస్తుంది. భయం ఏందుకు వేస్తుంది? మెదడులో భయం అనుభూతిని కలిగించే రెండు సర్క్యూట్లు ఉంటాయి. ఈ సర్క్యూట్‌లలో కాల్సిటోనిన్ జన్యు సంబంధిత మెదడు, పెప్టైడ్ అమిగ్డాలాలోని న్యూరాన్‌లు ఇవన్నీ కలిసి భయం అనుభూతిని కలిగిస్తాయి. ఒక మనిషి భయపడినప్పుడు, అతని శరీరంలో ప్రత్యేక హార్మోన్లు, రసాయన మూలకాలు విడుదలై వీటిల్లో కార్టిసాల్, నోర్‌పైన్‌ఫ్రైన్, ఎపినెఫ్రైన్, కాల్షియం వంటి హార్మోన్లు భయం అనుభూతి చెందుతున్న సమయంలో శరీరంలో వివిధ విధులను నియంత్రిస్తాయని సైన్స్ ప్రకారం ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: గొంతులో ఆహారం ఇరుక్కుంటే యమ డేంజర్.. అప్పుడు ఇలా చేయండి! #health-benefits #science-reason #fear మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి