Sabarimala: శబరిమల అయ్యప్ప 18 మెట్ల పేరేంటో తెలుసా?వాటి వెనకున్న రహస్యం తెలుస్తే షాక్ అవ్వడం పక్కా..!!

చాలా మంది నియమ, నిబంధనలతో అయ్యప్ప మాలలు వేసుకుంటారు. మండల దీక్ష తీసుకుని...41రోజుల తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. 41రోజులు దీక్ష చేసినవారే 18మెట్లు ఎక్కుతారు. బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరంతో తయారు చేశారు. 18 మెట్లు, 18 పురాణాల గురించి చెబుతాయి.

New Update
Sabarimala: శబరిమల అయ్యప్ప 18 మెట్ల పేరేంటో తెలుసా?వాటి వెనకున్న రహస్యం తెలుస్తే షాక్ అవ్వడం పక్కా..!!

Sabarimala Ayyappa 18 Steps Names: కార్తీక మాసంలో చాలా మంది అయ్యప్ప భక్తుల మాలలు వేసుకుంటారు. కఠోర మండల దీక్షను 41 రోజులు పాటిస్తారు. తర్వాత కేరళలోని (Kerala) అయ్యప్ప స్వామిని దర్శించుకుని ఇరుముడి కట్టుకుని యాత్రను కొనసాగిస్తారు. శబరిమల (Sabarimala) చేరుకుని ముందుగా పంబ నదిలో స్నానం చేసి కొండపైకి స్వామి వారిని స్మరించుకుంటూ చేరుకుంటారు. ముందుగా స్వామిని దర్శించుకోవాలంటే 18 మెట్లు ఎక్కాలి. 41రోజుల దీక్ష తీసుకుని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కుందుకు అర్హులు. 18 మెట్లు (18 Steps) బంగారం, వెండి, ఇనుము, రాగి, తగరం వంటి పంచలోహాలతో తయారు చేస్తారు. గతంలో పదునెట్టాంబడి ఎక్కే భక్తులు మెట్టు మెట్టుకూ కొబ్బరికాయలు కొట్టే ఆయనవాయితీ ఉంటుండే. దీనివల్ల మెట్లు పూర్తిగా శిథిలవ్వడంతో 1985నవంబర్ 30 పంచలోహాలతో తయారు చేసిన మెట్లను అమర్చారు. కొబ్బరికాయలు మెట్ల మీద కొట్టకుండా పడి పక్కనే కింద భాగంలో కొట్టే ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: గవదబిళ్లలు అంటే ఏమిటి? తెలంగాణలో భారీగా పెరుగుతున్న కేసులు..!!

ఈ 18 మెట్లను పదునెట్టాంబడి అని పిలుస్తారు. 18 మెట్లు, 18 పురాణాల గురించి వివరిస్తున్నాయి. అయ్యప్ప దుష్టశక్తులను సంహరించడానికి ఉపయోగించిన 18 ఆయుధాలని పురాణాలు చెబుతున్నాయి. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలైన కళ్లు, చెవులు, నాసిక, నాలుక, చర్మం గురించి తెలుపుతే...మిగతా 8 మెట్లు రాగద్వేషాలైన తత్వం, కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, అహంకారాన్ని సూచిస్తాయి. తర్వాత 3 మెట్లు సత్వ, తమో, రోజో గుణాలకు ప్రతీకగా నిలుస్తాయి. 17, 18 మెట్లను విద్యను, అజ్నాన్ని సూచిస్తాయి.

ఇక ఈ 18 మెట్లను పరుశరాముడు నిర్మించారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అష్టదిక్పాలకులు 8మంది ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు, రెండు యోగములు కర్మయోగం, జ్నానయోగం, విద్య, అవిద్య, జ్నానం, అజ్నానానికి రూపాలుగా ఈ 18 మెట్లను ఏర్పాటు చేశారు. సన్నిధానంలో చేరిన భక్తులు 18మెట్లను ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి, నెయ్యితో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు.
Ayyappa 18 Steps Names: అణిమ, మహిమ, లఘిమ, ఈశ్వత వశ్యత, ప్రాకామ్య, బుద్ధి, ఇచ్చ, ప్రాప్త సర్వకామ, సర్వసంపత్కర, సర్వప్రియకర, సర్వంగళాకార, సర్వ దుఖ విమోచన పర్వ సుందర, మ్రుత్యు ప్రశమన, సర్వ విఘ్న నివారణ, సర్వాంగ సర్వ సౌభాగ్యదాయక పేర్లతో వీటిని పిలుస్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు