Tomato Price : దేశంలో టమోటా ధరలు కొండెక్కికూర్చుకున్నాయి. కిలో చికెన్ కొనుక్కొని తినొచ్చు..కానీ టమోటాలు కొనలేమంటున్నారు సామాన్య ప్రజలు. టమాటా ధర కేజీ రూ. 100 నుంచి 180వరకు విక్రయిస్తున్నారు. ధరలు ఎందుకు పెరిగాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యే మహారాష్ట్ర సహా ఉత్తరభారతదేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో కురిసిని భారీ వర్షాల కారణంగానే టమాటా ధరలు భారీగా పెరిగాయిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా టమాటా ధరలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతకుముందు కిలో రూ. 20 ఉన్న టమాటా ధరల ఇప్పుడు రూ. 100 దాటింది.
అయితేదేశంలోనే తొలిసారిగా టమాట ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) ప్రత్యక్ష చర్యలు చేపట్టారు. పొరుగు దేశమైన నేపాల్ (Nepal) నుంచి టమాటాలను (Tomatoes) దిగుమతి చేయాలని నిర్ణయించారు. టమాటా సరఫరాకు సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్లు తెలిపారు. త్వరలోనే యూపీకి టమాటాలోడ్ చేరుకుంటుందన్నారు. ఇక కూరగాయాలు అధికంగా సాగుచేసే కర్నాటకలోని కోలార్, మాండ్య జిల్లాల నుంచి కూడా టమాటాను తక్కువ ధరలు కొనుగోలు చేసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ, కర్నాటక రాష్ట్రాల్లో కొత్త పంటలు రావడంతో టమాటా ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఢిల్లీలో రూ. 70కి విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
టమాటా ధరలు భారీగా పెరగడంతో రైతులు పెద్దెత్తున పంటను వేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో టమాటా ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. తమిళనాడులో టమాట కేజీ ధర రూ. 70లు ఉంది. 45రోజుల్లో మామూలు పరిస్థితికి వస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: వన్ప్లన్ నుంచి అదిరిపోయే ఆఫర్..లైఫ్ టైం స్క్రీన్ రిప్లేస్మెంట్ ఫ్రీ..!!