ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ తన కస్టమర్లకు అదిరే శుభవార్త చెప్పింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఇలాంటి ఆఫర్‌తో కంపెనీ ముందుకు వచ్చింది. వన్ ప్లస్ తన స్మార్ట్ఫోన్లపై లైఫ్‌టైమ్ వారంటీని అందిస్తున్నట్లు ప్రకటించింది. గ్రీన్ స్క్రీన్ సమస్యను ఎదుర్కొంటున్న స్మార్ట్ఫోన్ల కోసం కంపెనీ ఈ ఆఫర్‌ను తీసుకుంది. OnePlus తెలిపిన వివరాల ప్రకారం.. వినియోగదారులు అన్ని మోడళ్లపై జీవితకాల వారంటీని పొందుతారు. మీకు OnePlus 8 Pro, OnePlus 8T, OnePlus 9, OnePlus 9R లేదా OnePlus 10 సిరీస్‌లో ఏదైనా మోడల్ ఉంటే..వాటిలో గ్రీన్ స్క్రీన్ సమస్య ఉంటే, మీకు కంపెనీ జీవితకాల వారంటీని ఇస్తుంది.
పూర్తిగా చదవండి..OnePlus : వన్‌ప్లన్ నుంచి అదిరిపోయే ఆఫర్..లైఫ్ టైం స్క్రీన్ రిప్లేస్మెంట్ ఫ్రీ..!!
వన్‌ప్లన్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తన స్మార్ట్ఫోన్లపై జీవితకాల వారంటీని అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఇందుకు కంపెనీ కొన్ని షరతులు కూడా పెట్టింది. మీరు పాత వన్ ప్లస్ మోడల్ నుండి కొత్త మోడల్‌కి మారితే, మీకు మంచి తగ్గింపు ఆఫర్ కూడా లభిస్తుంది.
Translate this News: