Badam Milk : ఎండాకాలంలో చల్లచల్లని బాదాం మిల్క్ ఎంతో మేలు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

ఎండల తాకిడికి ఏదైనా చల్లగా తాగితే బాగుండు అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. వివిధ రకాల పండ్ల జ్యూస్‌లతో పాటు చల్లటి బాదాం మిల్క్‌ కూడా వేసవి తాపం నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. మరి ఇంట్లోనే బాదంపాలు ఎలా తయారు చేసుకోవాలో తెలియాలంటే ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Badam Milk : ఎండాకాలంలో చల్లచల్లని బాదాం మిల్క్ ఎంతో మేలు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

Badam Milk Benefits : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Summer) మండిపోతున్నాయి. పగటిపూట బయటికి వెళ్లాలంటేనే ప్రజలు వామ్మో అంటున్నారు. ఒకవేళ బయటికి వెళ్తే మాత్రం ఎండల తాకిడికి ఏదైనా చల్లగా తాగితే బాగుండని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. కానీ, బయట దొరికే రకరకాల రసాయన మిశ్రమాలతో కూడిన డ్రింక్స్(Drinks) కంటే ఇంట్లోనే చేసుకునే డ్రింక్స్‌ తాగితే  చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Also Read : సమంత ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు..!

వివిధ రకాల పండ్ల జ్యూస్‌లతో పాటు చల్లచల్లటి బాదాం మిల్క్‌(Badam Milk) కూడా ఇంట్లో చేసుకుని తాగొచ్చు.  వేసవి తాపం నుంచి బాదం పాలు కూడా తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. మరి ఇంట్లోనే బాదంపాలు ఎలా తయారు చేసుకోవాలి.. దానికి కావాల్సిన పదార్థాలేంటి అనుకుంటున్నారా.. చాలా సింపుల్

కావాల్సిన పదార్థాలు..

బాదంపప్పులు – 1 కప్పు
జీడిపప్పు – 1 కప్పు
చక్కెర – 100 గ్రాములు
యాలకుల పొడి – 1/2స్పూన్
పాలు – 1/2 లీటర్

తయారీ విధానం..

ముందుగా బాదాంపప్పు, జీడిపప్పును మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.. ఈ పొడిని పక్కన పెట్టుకుని.. మరో గిన్నెలో వెన్న తీయని పాలను మరిగించుకోవాలి. మరిగిన పాలలో యాలకుల పొడితోపాటు చక్కెర వేసి బాగా కలుపుకోవాలి..తర్వాత ముందే పొడిచేసి పెట్టుకున్న బాదాం, జీడిపప్పు మిశ్రమాన్ని పాలల్లో కలపాలి.. ఆపై చిన్న మంట మీద 10 నిమిషాలపాటు మరగనివ్వాలి.. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని కాసేపు చల్లారబెట్టుకోవాలి.ఆ తర్వాత ఈ బాదాం పాలను గ్లాసుల్లో పోసి, పైన సన్నగా తరిగిన బాదాం, జీడిపప్పులు(Cashew Nuts) చల్లుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అంతే చల్లచల్లటి బాదాం పాలు రెడీ.

ఆరోగ్యానికి ఎంతో మేలు..

రోజూ ఇలా బాదం మిల్క్‌ చేసి ఇంట్లో పిల్లలకు తాగిస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు. బయట దొరికి డ్రింక్స్ కంటే ఇంట్లో చేసుకునే ఇలాంటి డ్రింక్స్‌ తాగితే పిల్లలు హెల్తీగా ఉంటారు. బాదాం, జీడిపప్పు శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. బరువును తగ్గించడంలోనూ ఈ రెండు తోడ్పడుతాయి. బాదంపప్పు రోజూ తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని పాలు శరీరానికి కాల్షియం అందిస్తాయని తెలిసిందే.  అదే విధంగా ఇది పిల్లలకు శక్తి నిచ్చి ఏకాగ్రతతో చదివేలా చేస్తుంది. బాదం, జీడిపప్పు, పాలు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Advertisment
తాజా కథనాలు