many benefits in A leaf: సుగంధ లక్షణాలు కలిగి ఉన్న ఆకుల్లో వామాకు ఒకటి. ఇది ఆరోగ్యంతో పాటు రుచిని రెట్టింపు చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక ఔషధ గుణాలు ఉన్న వాము ఆకులను పలు చికిత్సలతో పాటు ఆయుర్వేదంలో వివిధ అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి ఉపయోగింస్తారు. వాము గింజలతోనే కాదు, వాము ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నవి. అవి ఏ విధంగా పనిచేస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వామాకు వల్ల ఉపయోగాలు:
- వాము ఆకుల్లో ఉండే శక్తి కడుపు ఉబ్బరం, జీర్ణ, అజీర్తి, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
- జీర్ణ సమస్యల నుంచి త్వరగా బయట పడాలంటే వాము ఆకులను నమిలి తినాలి. గ్యాస్ట్రిక్ జ్యూస్‌లను విడుదల చేయడంలో వాము ఆకు బాగా పనిచేస్తుంది.
- నోటిలోని బ్యాక్టీరియా, నోటి దుర్వాసన పోయి.. నోరు రిఫ్రెష్‌గా ఉండాలంటే వాము ఆకును నమిలి తినాలి.
- వామాకులో ఎ, బీ, సీ విటమిన్లు, అమినో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం పుష్కలం. అందుకే ఇది మంచి పోషకాహారమని నిపుణులు చెబుతున్నారు.
- వాము ఆకు చిన్న పిల్లలకు వచ్చే దగ్గు, జలుబు సమస్యలను తగ్గిస్తుంది.
- ప్రతీరోజు రాత్రి అన్నం తిన్నాక వాము ఆకును తింటే జీర్ణక్రియ పనితీరుతోపాటు ఆకలిని పెచ్చుతుంది.
- వాము ఆకు రసంలో తేనే కలిపి చిన్న పిల్లలకు ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్‌రావు.
- శరీరంపై గాయాలను, మచ్చలను వాము ఆకులో యాంటీ సెప్టిక్ లక్షణాలు వెంటనే తగ్గిస్తుంది.
- చిన్నారుల్లో వచ్చే కడుపునొప్పికి వాము ఆకు బెస్ట్ మెడిసిన్.
- వాము ఆకు తలనొప్పి నివారణకు మంచి ఔషధం. నొప్పి ఉన్నకాడ వాము ఆకుల్ని రుద్దితే తలనొప్పి పోతుంది.
- ఈ వాముని ఔషధంగా, ఆహారపదార్ధాల్లో వాడుకోవచ్చు. వాము ఆకుతో బజ్జీలు, పెరుగు పచ్చడి వంటివి చేసుకోవచ్చు. ఇలా తింటే రుచితో పాటు అజీర్తి సమస్యలు రావు.
- పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో వాము ఆకుల్ని రుద్దినా విషం వెంటనే బయటకు వస్తుంది.
- వాము ఆకులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టు సమస్యల్ని దూరం చేసి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
- నెలసరి నొప్పి నుంచి ఉపశమనం కాలంటే వామాకు తినాలి.
- ప్రతిరోజు వామాకు టీని తాగడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు మంచి ఫలితం ఉంటుంది.
- ప్రతిరోజు ఉదయం వాము ఆకులతో తయారు చేసిన టీని తాగితే జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి.
- వాము ఆకులతో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగిస్తాయి.