Ganesh Chaturthi 2024: వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడో తెలుసా?

తొలి పూజలందుకునే వినాయకుడికి ఎన్నో పేర్లున్నాయి. అందులో ఏకదంతుడు అనేది ఒకటి. మరి అసలు గణపతి ఏకదంతుడు ఎలా అయ్యాడు. ఆ విరిగిన దంతం ఎక్కడ పడిందో మీకు తెలుసా? దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ ఆర్టికల్ లో..

New Update
Ganesh Chaturthi 2024: వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడో తెలుసా?

Ganapati: గణపతి ఏకదంతుడు ఎలా అయ్యాడు అనేదానికి రకరకాల పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గణపతి పురాణంలో చెప్పబడినదాని ప్రకారం.. వినాయకుడి పరశురాముడు మధ్య యుద్ధం జరిగింది. పరశురాముడు శివుడిని కలవడానికి వచ్చినప్పుడు లోపలికి వెళ్లటానికి వినాయడు అనుమతి ఇవ్వలేదు. దీంతో కోపం వచ్చిన పరశురాముడు లోపలికి వెళ్లనివ్వకపోతే నాతో యుద్ధం చేయాలని అతనితో అన్నాడట. నేను గెలిస్తే శివుడిన్ని కలవడానికి లోపలికి అనుమతి ఇవ్వాలని కోరాడు. దానికి అంగికరించిన గణేష్‌డు యుద్ధం చేయడానికి ఒప్పుడుకున్నాడు. ఇద్దరి మధ్య భీకరయుద్ధం జరుగుతున్న సమయంలో పరశురాముడు గొడ్డలితో గణేషుడిపై దాడి చేశాడు. ఈ గొడ్డలి గణేష్‌డి దంతాలలో ఒకదానికి తగిని విరిగిపడిందట. అప్పటి నుంచి గణపతి ఏకదంతుడు అయ్యాడని పేరు వచ్చిది.

ఇక మరో ఇతిహాసం ప్రకారం.. వినాయకుడి పంటి విరగడానికి కారణం పరశురాముడు సోదరుడు కార్తికేయుడట. ఇద్దరు సోదరుల వ్యతిరేక స్వభావం జరిగిన ఓ పోరాటంలో వినాయకుడు కార్తికేయుడిని ఎక్కువగా ఇబ్బంది పెట్టాడనీ, ఆ సమయంలో కార్తికేయుడు గణేశుడుని కొట్టడం వలన దంతాలలో ఒకటి విరిగిపోయింది అంటారు. అంతేకాకుండా మరొక కథ అత్యంత ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని వినాయకుడిని కోరినప్పుడు ఒక షరతు పెడతాడు. తాను మహాభారతాన్ని చెప్పే క్రమంలో ఆపకుండా చెబుతూనే ఉంటాననీ, కాబట్టి వింటూ ఆపకుండా రాయమని అంటాడు.. ఆ సమయంలో వినాయకుడు స్వయంగా తన దంతాలలో ఒకదానిని విరిచి పెన్నులా తయారు చేశాడని అందుకే ఏకదంతుడు అయ్యాడని అంటారు.

వినాయకుడి దంతం పడిన ప్రాంతం:

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో బర్సూర్ ఊరులోని ధోల్కల్ కొండలపై 100 సంవత్సరాల పురాతనమైప గణేష్ విగ్రహం 3000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోని అరుదైన విగ్రహాలలో ఒకటి. ఇతడిని దంతెవాడ రక్షకుడిగా పిలుస్తారు. పరుశురాముడికి, గణేశుడికి జరిగిన యుద్ధంలో దంతం విరిగిన ప్రాంతం ఇదేనట..అందుకే దీన్ని దంతేవాడని పిలుస్తారు. అంతేకాదు దంతేవాడ జిల్లాలో కైలాస గుహ కూడా ఉందట. ఇక్కడే గణపతికి, పరశురాముడికి మధ్య యుద్ధం జరిగిందంటారు. ఈ సారి మీరు అటువైపు వెళ్తే ఈ ప్రదేశం చూడడం అస్సలు మానకండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు