ఈపీఎఫ్ఓ లో పెన్షన్ వివరాలు తెలుసుకోండి!

అధిక వేతనంపై అధిక పెన్షన్ కోసం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తూ కావాల్సిన పత్రాల జాబితాను ఈపీఎఫ్ఓ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కీలక సర్క్యూలర్ తో అధిక పెన్షన్ కోసం చందాదారులు తమకు పింఛన్ ఎంతొస్తుందనేది తెలుసుకునేందుకు కొత్త ఫార్ములాను రిలీజ్ చేసింది.

New Update
ఈపీఎఫ్ఓ లో పెన్షన్ వివరాలు తెలుసుకోండి!

పీఎఫ్ చందాదారులకు అధిక వేతనంపై అధిక పెన్షన్ అందుకునేందుకు వీలు కల్పిస్తోంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) . ఇప్పటికే ఉమ్మడి ఆప్షన్‌పై వెనక్కి తగ్గింది. ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు సమయంలో అవసరం లేదని, అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటో వెల్లడించింది. పెన్షన్ మంజూరు సమయానికి యజమాని, ఉద్యోగి కాంట్రిబ్యూషన్ చేసినట్లు అనుమతి పత్రం చూపించొచ్చని తెలిపింది.

ఇప్పుడు ఉద్యోగులకు మరో సర్క్యూలర్ జారీ చేసింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద వాస్తవ జీతం ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఎంచుకునే ఉద్యోగులకు అధిక పెన్షన్ ఎలా లెక్కిస్తారో తెలిపింది. కొత్త ఫార్ములానూ విడుదల చేసింది. దీని ప్రకారం సెప్టెంబ్ 1, 2014కు ముందు, తర్వాత పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ క్యాలిక్యులేషన్ వేరు వేరుగా ఉండనుంది. ఈ విషయాన్ని పీఎఫ్ చందాదారులు గుర్తుంచుకోవాలి.అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఈపీఎస్‌లో 2014, సెప్టెంబర్ 1 కన్నా ముందు నుంచే ఉన్నట్లయితే, అప్పుడ పదవీ విరమణ తేదీకి 12 నెలల ముందు ప్రకారం అధిక పెన్షన్ లెక్కిస్తారు.

పెన్షన్ ఫండ్ నుంచి ఎగ్జిట్ తీసుకోవడానికి ముందు 12 నెలల ప్రకారం లెక్కించి పెన్షన్ ఇస్తారు. మరోవైపు.. 2014, సెప్టెంబర్ 1 లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ఆ తేదీకి ముందు 60 నెలల వ్యవధిలో సర్వీస్ కాంట్రిబ్యూటరీ పీరియడ్‌లో సగటు వేతనాన్ని పరిగణనలో తీసుకుంటారు. ప్రభుత్వం 2014, సెప్టెంబర్‌లోనే పెన్షన్ లెక్కించే సూత్రాన్ని సవరించిన విషయం తెలిసిందే. అందుకే ఈ తేదీనే ప్రామాణికంగా తీసుకుంటారు. 2014, ఆగస్టు 31 వరకు పదవీ విరమణ చేసిన వారు ఆ తేదీకి ముందు 12 నెలల సగటు జీతం పరిగణనలోకి వస్తుంది. 2014, సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వం దానిని 60 నెలలకు సవరించింది. ఈ సవరణ కారణంగా సెప్టెంబర్ 1, 2014 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ తక్కువగా వస్తుంది.

Advertisment
తాజా కథనాలు