Forehead Lines: మీ నుదుటిపై ఈ రేఖలు ఉన్నాయా..అయితే తిరుగుండదు

సముద్ర శాస్త్రం ప్రకారం నుదిటిపై రేఖలతో భవిష్యత్‌ను తెలుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీవితం అంతా నుదుటిపై రాసి ఉంటుంది. నుదిటిపై మొదటి రేఖ శ్రేయస్సు , ఆనందం, సంపదను తెలుపుతుంది. అన్ని రేఖల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

New Update
Forehead Lines: మీ నుదుటిపై ఈ రేఖలు ఉన్నాయా..అయితే తిరుగుండదు

Forehead Lines: మన నుదిటిపై చాలా ముడతలు ఉంటాయి. భవిషత్‌ మంచిగా ఉండాలంటే కొందరూ శాస్త్రలను నమ్ముతారు. సముద్ర శాస్త్రం బట్టి భవిష్యత్‌ను తెలుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నుదుటిపై ఉన్న రేఖల ద్వారా భవిష్యత్తులో ఎలా ఉంటారో తెలుసుకోవచ్చు. నుదుటిపై గీతలకు కొన్ని గ్రహాలకు సంబంధం ఉంటుంది. ఈ రేఖ భవిష్యత్త్‌ను చెపుతుందని చెబుతున్నారు. సముద్ర శాస్త్రం ప్రకారం.. జీవితం అంతా నుదుటిపై రాసి ఉంటుందంటున్నారు. శరీరంలోని వివిధ భాగాలు మన పాత్ర, భవిష్యత్త్‌ గురించి చెప్పగలవు. అంతేకాదు నుదిటిపై చాలా రేఖలు జీవితాన్ని, వర్తమానం భవిష్యత్త్‌ గురించి చెప్పగలదు. వాటిలో కొన్ని మంచి, కొన్ని చెడును సూచించే రేకలున్నాయి. అయితే.. ఏవి అనుకూలమో, ఏవి అనుకూలం కాదో అనేదానిపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

నుదిటిపై రేఖలపై ఉన్న అదృష్టాలు ఇవే:

  • నుదిటిపై మొదటి రేఖ శ్రేయస్సు , ఆనందం, సంపదను తెలుపుతుంది. సముద్ర శాస్త్రం ప్రకారం..ఈ లైన్ ఎంత స్పష్టంగా ఉంటే.. జీవితం అంత సంతోషంగా ఉంటుందట.
  • నుదిటిపై ఈ రేఖ అస్పష్టంగా ఉంటే ఆర్థిక సంక్షోభం జీవితాంతం ఉంటుందని చెబుతున్నారు.
  • నుదిటిపై 2వ రేఖ ఆరోగ్యానికి సంబంధించినంది. ఈ లైన్ స్పష్టంగా ఉంటే.. ఆరోగ్యంగా ఉన్నారని.. అస్పష్టంగా ఉంటే.. శారీరక సమస్య ఉందని నిపుణులు అంటున్నారు.
  • నుదుటిపై 3వ రేఖ మంచిగా ఉంటే అదృష్టవంతుడు అవుతారు. ఈ రేఖ స్పష్టంగా, లోతుగా ఉంటే.. అదృష్టవంతుడని సూచిస్తున్నారు.
  • నుదిటిపై ఉంటే 4వ రేఖ జీవితం సంక్షోభాలు, అడ్డంకులతో నిండి ఉంటుంది.
  • నుదిటిపై ఐదు ముడతలుంటే మంచిది కాదని అర్థం. ఎందుకంటే అవి సంక్షోభ తీవ్రతను సూచిస్తాయని సముద్ర శాస్త్రంనిపుణులు అంటున్నారు.
  • నుదిటిపై 6వ రేఖ ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాంటి వ్యక్తులు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తాడట.

ఇది కూడా చదవండి: ఆల్కహాల్‌ తాగి మెడిసిన్ వేసుకుంటే ఏమవుతుంది..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు