అరటి పండులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, అత్యవసర మినరల్స్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి ఎన్నో రకాలు ఉపయోగం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు ఉన్నవారు అరటి పండు తీసుకుంటే అవి మరింత పెరుగుతాయనే భయం అందరిలో ఉంటుంది. అందరికీ ఇష్టమైన పండ్లలో అరటి పండు ఒకటి. అరటి పండులో ఎన్నో రకాలు మరియు జాతులు ఉంటాయి. ఒక్కో రకంలో ఒక్కో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే.. చక్కెర కేళి, సాధారణ అరటి పండ్లను అందరూ ఎక్కువగా తింటారు. అయితే.. ఈ మధ్య ఎక్కువగా రెడ్ బనానా పాపులర్ అయింది. ఎరుపు రంగులో ఉండే ఈ అరటి పండులో ఎక్కువ పోషకాలున్నాయి. 21 రోజులు ఈ పండును తింటే శరీరంలో పలురకాల మార్పులు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. మరి రెడ్ బనానా వల్ల ఎలాం ఉపయోగాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నరాల సమస్యలు
ఎరుపురంగు అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు నాడీ వ్యవస్థను బల పరుస్తాయి. అంతేకాకుండా నరాల సమస్యలు, మూర్ఛ వ్యాధి ఉన్నవారు ఈ అరటి పండు తింటే ఆ సమస్యలన్నింటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కిడ్నీలో రాళ్ల
ఎరుపురంగు అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ పండును తరుచూ తింటే కిడ్నీలో రాళ్ల సమస్యను తగ్గుతుందని వైద్యులు అంటున్నారు.
కంటి చూపు మెరుగు
ఈ మధ్య కాలంలో చాలామంది కంటి చూపు, కంటి శుక్లాల సమస్యతో భాద పడుతారు. ఇలాంటి సమస్యలు ఉన్నా ఈ బానానా తినడం వల్ల సమస్య నుంచి బయట పడొచ్చు.
చర్మ సమస్యలు
డ్రై స్కిన్, దద్దుర్లు, చర్మం ఎర్రబడడం, సోరియాసిస్ వంటి చర్మ సమస్యల్ని దూరం చేయడంలో ఈ రెడ్ కలర్ బనానాలు బెస్ట్ మెడిసిన్.
సంతాన లేమి సమస్యలు
ప్రస్తుతం సంతాన లేక చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ అరటిపండు తింటే పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో సంతానోత్పత్తి పెగటంతో పాటు అంగ స్తంభన సమస్య దూరమవుతుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది
రక్తపోటు రోగులకు ఎర్ర అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. ఎర్రటి అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంది. ఇది రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు అదుపులో ఉండాలంటే ఎర్రటి అరటిపండ్లను తప్పనిసరిగా తినాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఎముకలు దృఢంగా..
ఎర్రటి అరటిపండును రోజూ తింటే ఎముకలు బలపడతాయి. ఇందులో కార్బోహైడ్రేట్ల వినియోగం వల్ల శరీరంలో శక్తి ఎక్కువ కాలం ఉంటుంది.
ఇది కూడా చదవండి: చలికాలంలో రోజు చన్నీళ్ల స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..?