Youthful Look: యూత్‌లా కనిపించాలంటే కొబ్బరినూనెతో ఇలా చేయండి

ముఖం మీద మచ్చల వల్ల ఇబ్బంది పడుతున్నట్లయితే అలోవెరా జెల్, కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల చర్మం మెరుస్తుంది. ఇది చర్మాన్ని చల్లగా ఉంచుతుందని నిపుణులు అంటున్నారు. కొబ్బరి నూనె, అలోవెరా జెల్‌తో ఫేస్ మాస్క్‌ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Youthful Look: యూత్‌లా కనిపించాలంటే కొబ్బరినూనెతో ఇలా చేయండి

Youthful Look: యవ్వనంగా, అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖంపై మొటిమలు, మచ్చలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే చింతించాల్సిన అవసరం లేదు. ముఖం మీద మచ్చల వల్ల ఇబ్బంది పడుతున్నట్లయితే అలోవెరా జెల్, కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల చర్మం మెరుస్తుంది. కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.

publive-image

ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలోవెరా జెల్ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. చర్మాన్ని చల్లగా ఉంచుతుందని నిపుణులు అంటున్నారు. కొబ్బరి నూనె, అలోవెరా జెల్‌తో ఫేస్ మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. దీని కోసం చెంచా కొబ్బరి నూనె, చెంచా అలోవెరా జెల్‌ను బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

publive-image

అంతేకాకుండా క్రీమ్ కూడా చేయవచ్చు. ఒక పాత్రలో కొబ్బరి నూనెను వేడి చేయాలి. అందులో కలబంద జెల్ వేసి తక్కువ మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి. కలబంద నల్లగా మారడం ప్రారంభించినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లబరచాలి. చల్లారిన తర్వాత ముఖానికి రాసుకోవచ్చు. కొంత మందికి కొబ్బరి నూనె లేదా కలబందకు అలెర్జీలు వస్తుంటాయి. కాబట్టి ఫేస్ మాస్క్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ముఖంపై చికాకు లేదా ఎర్రటి దద్దుర్లు ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

ఇది కూడా చదవండి: తెలంగాణలో భానుడి భగభగలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు