Snoring: ఇలా చేస్తే ఎంతటి గురక అయినా తగ్గాల్సిందే.. గురక మీకు సమస్యగా మారిందా..?

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడమే చాలా కష్టం. కొందరైతే ఏదో నిద్రపోయమా..? అన్నట్లుగానే ఉంటారు. మరి కొందరు కంటినిండ నిద్ర పోతారు. అయితే అదే సమయంలో ఎవరైనా గురక పేట్టే వాళ్ళు పక్కన ఉంటే ఆ నరకం అంతా ఇంతా కాదు. సాధారణంగా ఎవరికైనా నిద్రపోయే సమయంలో గురక వస్తుంది. అయితే ఈ గురక సమస్య అనేది మహిళలు- పురుషుల్లో కూడా ఉంటుంది. కానీ ఈ సమస్య ఎక్కువగా పురుషులకే ఉంటుంది. ఈ గురక రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Health Tips : మీ పార్ట్‎నర్ రాత్రంతా గురకతో చిర్రెత్తిస్తున్నారా? ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి..దెబ్బకు గురక వదలాల్సిందే...!!
New Update

మారుతున్న జీవనశైలిలో చాలామందికి గురక ఓ పీడలాగా వెంటాడుతోంది. అయితే ఈ గురక అనేది లావుగా ఉన్న వారిలో ఎక్కువగా వస్తోంది అంటున్నారు. కానీ సన్నగా ఉన్న వాళ్ళలో కూడా కొందరికి గురక సమస్య ఉంటుంది. ఈ గురక వల్ల మీకేమీ కాదు గాని.. మన పక్కన పడుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకి తెలియకుండానే నిద్రలో గురక వస్తుంది. దీనిని కంట్రోల్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. అయితే ఈ గురకను కొన్ని జాగ్రత్తలతో దీనిని నివారించుకోవచ్చు. అయితే ఈ గురక వ్యాది కాదు... శ్వాస సంబంధ లక్షణాల వల్ల గురక వస్తుంది. ఇది తగ్గాలంటే ఈ కింద చిట్కాలు మీకోసం.

ఈజీగా సమస్య మాయం

గురక రాకూడదంటే.. తేనెతో ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఈ తేనె నాసికా రంధ్రాలను క్లియర్‌గా తెరుస్తోంది. అంతేకాదు జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి దీన్ని ఎక్కువగా వాడుతారు. దీని వల్ల గాలి స్వేచ్ఛగా తీసుకోవచ్చు. పైగా దీనిలో యాంటి మైక్రోబయల్స్‌ ఆధికంగా ఉంటాయి. అందువల్ల రాత్రి నిద్రపోయే సమయంలో తేనెను పాలల్లో కలిపి తాగిన మంచి ఫలితం ఉంటుంది. పుదీనా ఆకుల్లో యాంటిస్పాస్మోడిక్‌ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అందరి ఇళ్లలో ఉండే ఈ ఆకులు తింటే ముక్కు, గొంతు లోపల మంటను రాకుండా చేస్తుంది. పడుకునే ముందు కొన్ని ఆకులను వేడి నీటిలో వేసి తీసుకోవడం వల్ల గురక సమస్య నుంచి బయట పడుతారు. దీనివల్ల మీరు హాయిగా నిద్రపోయి.. పక్కవారిని కూడా హాయిగా నిద్రపోయేలా చేస్తారు.

ప్రతిరోజు ఆహారంలో ఇవి ఉండాలి

అయితే ఇన్ఫెక్షన్లకు వెల్లుల్లి అనేది బాగా పనిచేస్తుందని కొంతమంది చెప్తూ ఉంటారు. రాత్రిపూట పడుకునే ముందు పచ్చి వెల్లుల్లి తింటే గురక వెంటనే తగ్గుతుంది వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి చేయదు అంటారు. ప్రతి ఇంట్లో ఉల్లిపాయ వాడకం అనేది సర్వసాధారణమే. అయితే ఈ గురక సమస్య పోవడానికి ఉల్లి కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు ఆహారంలో ఉల్లిపాయను తీసుకుంటే చాలా మంచిది. ఉల్లిపాయ గురుక రాకుండా చేస్తుంది. ఈ చిన్న పాటి చిట్కాలను పాటించినా జీవనశైలి మార్పులతో గురక సమస్య నుంచి బయటపడి పడకపోయినా కొంతమందికి నిద్రావస్థ కారణంగా గురక వస్తే డాక్టర్ల సహాయం అవసరం ఉంటుంది. అయితే మీరు తరచుగా గురక వల్ల ఆందోళన చెందుతుంటే.. మంచి డాక్టరని సంప్రదిస్తే సమస్య నుంచి బయట పడవచ్చు.

ఇటి వల్ల సాధ్యం

* రోజూ పడక గదిని శుభ్రం చేసుకోవాలి

* మద్యం సేవించే అలవాటును ఉంటే మానుకోవాలి

* ముక్కు రంధ్రాలు తెరిచి ఉంటే పట్టీలు వేసుకోవాలి

* గురకపెట్టకుండా ఉండాలంటే వాయుమార్గం తెరుచుకుని ఉండాలి

* ముక్కు మూసుకుపోకుండా శుభ్రంగా చేసుకోవాలి

* నిత్రపోయే ముందు పచ్చి అటుకులను తింటే గురక రాదు

* నిద్రపోయే ముందు తేనె, ఆలివ్ ఆయిల్‌ కలిపి తాగితే మంచిది

* పక్కకు తిరిగి పడుకుంటే గురక ఎక్కువగా రాదు

* పడుకునేటప్పుడు తల భాగం ఎత్తు ఉంటే బెటర్

* యోగా, ప్రాణాయామం వల్ల గురక తగ్గుతుంది

* గొంతు, నాలుకకు సంబంధించిన వ్యాయామాలు రోజు చేయాలి

ఇది కూడా చదవండి: సిక్కింలో కుంభవృష్టి..14 మంది దుర్మరణం.. ఎంతమంది మిస్ అయ్యారంటే

#should-be-reduced #problem-for-you #snoring
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe