Medicines: మందులు వేసుకునేప్పుడు ఈ ఆహారం అస్సలు తీసుకోవద్దు ఏ పేషెంటైనా సమయానికి మందులు వేసుకోవాలి. డైట్‌పై శ్రద్ధ పెట్టాలి. మందులు వేసుకునే సమయంలో అరటిపండు, పుల్లని పండ్లు, టీ, కాఫీ, పాల ఉత్పత్తులు, మద్యం, చల్లని పానీయాలు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 13 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Medicines: ఏ డాక్టర్ అయినా తన పేషెంట్లకు సమయానికి మందులు వేసుకోవాలని, అంతేకాకుండా డైట్‌పై శ్రద్ధపెట్టాలని చెబుతూ ఉంటారు. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని బట్టి కూడా ఆ మందుల పనితీరు ఆధారపడి ఉంటుంది. అయితే.. మందులు వేసుకునేటప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటేనే ఆ మందులు పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాం. అరటిపండు: ప్రజలు అనారోగ్యంతో ఉన్నప్పుడు తరచుగా అరటిపండ్లను తింటారు. అరటిపండ్లలో పొటాషియం ఉంటుంది. కానీ బీపీకి సంబంధించిన మందులు వాడుతుంటే అరటితో పాటు పొటాషియం ఎక్కువగా ఉండే పండ్లను తినకూడదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఇవి తింటే హృదయ స్పందన రేటు మరింత పెరుగుతుంది. పుల్లని పండ్లు: మందులు వాడుతుంటే పుల్లని పండ్లు తినవద్దు. పుల్లని పండ్ల ప్రభావం 50 శాతం మందులపై అధికంగా పడుతుంది. అంతేకాకుండా శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ఏదైనా మందులు వాడుతున్నప్పుడు నిమ్మ, నారింజ, ద్రాక్ష, పచ్చళ్లు, చింతపండు అస్సలు తినకూడదని వైద్యులు అంటున్నారు. టీ, కాఫీ: వేడి కారణంగా మందుల్లో ఔషధ గుణాలు పోతాయి. కాబట్టి ఆ మందులు వేసుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు టీ, కాఫీ లేదా ఏదైనా వేడి ఆహారం లేదా పానీయాలతో టాబ్లెట్స్ వేసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. మందులు చల్లటి లేదా సాధారణ నీటితో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. పాల ఉత్పత్తులు పాలు, చీజ్, పెరుగు, క్రీమ్‌లాంటి పాల ఉత్పత్తులు మీ శరీరంలోని కొన్ని యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని అడ్డుకుంటాయి. పాలలోని కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. మద్యం మద్యంతో మందులు ఎప్పుడూ తీసుకోకూడదు. టాబ్లెట్స్‌లో ఆల్కహాల్ మిక్స్ కావడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఆల్కహాల్ తాగినప్పుడు మందులు వేసుకోకూడదు. చల్లని పానీయాలు సోడా, కూల్‌డ్రింక్స్ తాగినప్పుడు మందులు వేసుకుంటే మన ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: పిల్లలకు కంటిశుక్లం ఎందుకు వస్తుంది..లక్షణాలు ఎలా ఉంటాయి..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #medicines మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి