Food Tips: ఈ 5 ఫుడ్స్ ని మళ్ళీ వేడి చేసి అస్సలు తినొద్దు.. లిస్ట్ ఇదే..!!

మనం రాత్రి మిగిలిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటుంటాము. ఆహారాన్నిమళ్లీ మళ్లీ వేడి చేసి తినడం వల్ల విషానికి కంటే తక్కువేం కాదు.

New Update
Food Tips: ఈ 5 ఫుడ్స్ ని మళ్ళీ వేడి చేసి అస్సలు తినొద్దు.. లిస్ట్ ఇదే..!!

ఆహారం వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. చల్లగా అయితే దాన్ని తినడానికి అస్సలు ఇష్టపడము. చలికాలంలో అయితే ఆహారం వండిన తర్వాత తొందరగా చల్లగా మారుతుంది. చాలా కుటుంబాలు మధ్యాహ్నం వండినదే రాత్రి కూడా తింటుంటారు. కానీ ఇలా చల్లగా మారిన ఆహారం తినలేము. ఇటు పడేయడానికి మనసు రాదు. చాలామంది అదే ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకుని తింటారు. దీని వల్ల ఆహారం వేస్ట్ కాకుండా, పొదుపు చేస్తున్నామని అనుకుంటారు. కానీ కొన్ని ఆహారాలను పొరపాటున కూడా మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినకూడదు. అలా తినడం వల్ల అందులోని పోషకాలు దెబ్బతింటాయి. అంతేకాదు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

బంగాళదుంపలు:
ఆలుగడ్డలను మళ్లీ వేడి చేసుకుని తినకూడదు. అలా చేస్తే క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా అందులో పెరుగుతుంది. మళ్లీ వేడి చేయడం వల్ల ఆలుగడ్డలో ఉండే బి6, పొటాషియం, విటమిన్ సి విచ్చిన్నం అవుతాయి. అలాంటి బంగాళాదుంప కూరను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే ఏమీ లభించకపోవడమే కాదు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

పాలకూర:
పాలకూర సూప్, పనీర్, గ్రేవీ, పప్పు వంటి వంటకాలను తయారు చేసినప్పుడు చల్లగా అయితే వాటిని పడేయక మళ్లీ వేడిచేసుకుని తింటారు. రుచిగా ఉంటుంది. కానీ దీన్ని మళ్లీ వేడి చేస్తే నైట్రేట్ లు నైట్రోజినేస్ గా మారుతాయి. ఇవి శరీరంలో కణజాలాన్ని దెబ్బతీస్తాయి.

అన్నం:
మిగిలిన అన్నం పాడేయ్యాలంటే మనస్సొప్పదు. చాలా మంది మిగిలిన అన్నంతో ఫ్రైడ్ రైస్, స్నాక్స్ చేస్తారు. కానీ అన్నంను మళ్లీ వేడి చేయడం మంచిది కాదు. శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా అందులో పెరుగుతుంది. ఫుడ్ పాయిజన్ కూడా కారణం అవుతుంది.

మాంసాహారం:
చికెన్, గుడ్లు వంటి మాంసాహారం వంటకాల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఒకసారి వేడి చేస్తే ఆ తర్వాత ఫుడ పాయిజనింగ్, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అధిక ప్రొటీన్ ఆహారంలో నైట్రోజన్ ఉంటుంది. దీన్ని మళ్లీ వేడి చేస్తే ఆరోగ్యానికి హానికరం.

పుట్టగొడుగులు:
పుట్టగొడుగుల్లో ప్రొటీన్, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని మళ్లీ వేడి చేస్తే ప్రొటీన్లు, ఖనిజాలు పాడవుతాయి. అవి విష పదార్థాలుగా మారుతాయి. జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి.

ఇది కూడా చదవండి: అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం.. దీని చరిత్ర,వివరాలివే..!!

Advertisment
తాజా కథనాలు