Resume Tips: చాలా మంది అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను తయారు చేస్తున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు, ఆ చిన్న మిస్టేక్స్ కెరీర్ పై అంత్యంత భారీ స్థాయిలో ప్రభావం చూపిస్తాయి. ఈ చిన్న పొరపాట్ల కారణంగా మీరు ఎంతటి ప్రతిభావంతులైనా సరే .. రిజెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. CVని రూపొందించేటప్పుడు కొన్ని టిప్స్ పాటించడం వల్ల కంపెనీ హెచ్‌ఆర్ మీ రెజ్యూమ్‌ని ఎంచుకుంటుంది.CV తయారు చేసేటప్పుడు ఏ ఏ విషయాలను గుర్తుంచుకోవాలి అనేది తెలుసుకుందాం.
మీ విజయాల గురించి
తరచుగా, అభ్యర్థులు తమ రెజ్యూమ్‌లో ఎన్ని కంపెనీలలో వర్క్ చేశారు .. ఏ పోస్ట్‌లలో పనిచేశారో పేర్కొంటారు, అయితే సంబంధిత కంపెనీలో మీరు సాధించిన విజయాలను మీ CVలో పేర్కొనడం మర్చిపోవద్దు. మీరు మీ CVలో దీని గురించిన సమాచారాన్ని తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని ఇతరులతో పోల్చి చూసినపుడు మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి
ప్రొఫైల్‌కు సంబంధించిన వివరాలు
రెజ్యూమ్‌లో మీ ఉద్యోగ ప్రొఫైల్‌కు అనుగుణంగా మీరు మీ CVని సిద్ధం చేసుకోవాలి. పోస్ట్‌కు నేరుగా సంబంధం లేని ఏ సమాచారాన్ని మీరు చేర్చకూడదని గుర్తుంచుకోండి. చాలా సార్లు, తమను తాము మంచి అభ్యర్థులుగా నిరూపించుకోవడానికి, అభ్యర్థులు వారికి సమస్యలను సృష్టించే పనిని చేస్తారు.
అనవసరమైన పదబంధాలను ఉపయోగించవద్దు
అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను ఆకర్షణీయంగా మార్చడానికి కొత్త కొత్త పదాలను ఉపయోగిస్తుండటం మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఈ రకమైన వాక్య నిర్మాణం మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
మీ CV ఫార్మాట్ మెరుగ్గా ఉండాలి
మీ రెజ్యూమ్ ఫార్మాట్ సరిగ్గా ఉన్నప్పుడే కంపెనీ HR మీ రెజ్యూమ్‌ని చూస్తుంది. చాలా పొడవుగా ఉన్న మరియు అనవసరమైన వివరాలను కలిగి ఉన్న రెజ్యూమ్‌లు వెంటనే తిరస్కరించబడతాయి.
స్పెషలైజేషన్ పేర్కొనడం మర్చిపోవద్దు
మీరు మీ ప్రొఫైల్‌కు సంబంధించి ఏదైనా స్పెషలైజేషన్ లేదా సర్టిఫికేట్ కోర్సు చేసి ఉంటే, దానిని మీ CVలో పేర్కొనడం మర్చిపోవద్దు. దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. చాలా సార్లు, వివరాలను పంచుకునేటప్పుడు, అభ్యర్థులు స్పెషలైజేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మరచిపోతారు, ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పొరపాటు వల్ల మంచి ఉద్యోగం మీ చేతుల్లోంచి జారిపోతుంది. సో.. మంచి రెజ్యూమ్ తయారు చేసుకోండి .. అముఞ్చి జాబ్ సొంతం చేసుకోండి.
Also Read:అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జనవరి 24న మాత్రమే ఎందుకు జరుపుకుంటారు?