Banana :ఈ ఆహార పదార్ధాలతో కలిపి అరటిపండు అస్సలు తినొద్దు..!

ఏడాది పొడ‌వునా ల‌భించే అర‌టి పండ్లు రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని ఆహార పదార్ధాలతో అరటి పండు కలిపి తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.. అవేంటో ఇప్పుడు చూద్దాం.

New Update
Banana :ఈ ఆహార పదార్ధాలతో కలిపి అరటిపండు అస్సలు తినొద్దు..!

అర‌టి పండులో ఫైబ‌ర్‌, ప్రొటీన్‌, యాంటీఆక్సిడెంట్లు, అత్య‌వ‌స‌ర మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉండ‌టంతో ఆరోగ్యానికి ఎన్నో ర‌కాలుగా ఉపయోగపడుతుంది. ఇక ఈ అరటి పండుకు సీజన్ అంటూ ఉండదు. ఏడాది పొడవునా దొరుకుతాయి. వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.జలుబు, దగ్గుతో ఇబ్బంది పడేవారు.. మధుమేహం ఉన్నవారు ఈ పండుకి దూరంగా ఉండాలని చెబుతారు. అయితే అరటి పండ్లను కొన్ని ఆహార పదార్ధాలకు జత కలిపి తినొద్దని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పండులో ఆమ్ల స్వభావం ఉంటుంది. పాలు తియ్యగా ఉంటాయి. ఈ రెండు కలిస్తే జీర్ణ సమస్యలకు దారి తీస్తుందట. జలుబు, దగ్గు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందట.రెడ్ మీట్‌లో ప్యూరిన్ ఉంటుంది. ఇది సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అయితే రెడ్ మీట్‌లో ఉండే అధిక ప్రొటీన్లు జీర్ణక్రియను నెమ్మది చేస్తాయి. విరుద్ధమైన స్వభావం ఉన్న రెండు ఆహార పదార్ధాలను తిన్నప్పుడు అవి జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు కలిగిస్తాయని నిపుణులు చెపుతున్నారు.

కొంతమంది రొట్టెలతో పాటు అరటి పండ్లను తింటారు. ఇది అనారోగ్యకరమైన పని అంటున్నారు నిపుణులు. రొట్టె లేదా కాల్చిన వస్తువులలో ప్రాసెస్ చేయబడిన పిండి పదార్ధాలు ఉంటాయి. అవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అరటి పండ్లు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. ఈ రెండు కలిపి తింటే పలు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందట.

Advertisment
తాజా కథనాలు