Life Style : ఉదయం లేచిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా.. అసలు చేయోద్దు!

చాలా మందికి ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. కానీ ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దం వైపు చూడటం అశుభం. ఉదయం లేచి అద్దంలో చూసుకుంటే నెగెటివ్ ఎనర్జీ అంతా లోపలికి వస్తుంది.

Life Style : ఉదయం లేచిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా.. అసలు చేయోద్దు!
New Update

Daily Life Style : మన జీవితాన్ని సంతోషంగా, శాంతియుతంగా గడపడానికి ఉదయం లేచినప్పటి నుంచి అనేక పనులు చేస్తుంటాం. అయితే ఉదయాన్నే లేచిన(Morning Wakeup) వెంటనే కొన్ని పనులను అసలు చేయకుండ ఉండటం చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం లేచిన వెంటనే ఏదైనా పొరపాటు పని చేస్తే ఆరోజంతా అసలు మంచిగా జరగదు. సమస్యలతో పాటు ఆర్థికంగానూ కొన్ని నష్టాలుంటాయి.

ఉదయం లేచిన వెంటనే ఈ తప్పులు చేయకండి

వాస్తు శాస్త్రం(Vastu Shastra) ప్రకారం, ఉదయం నిద్రలేచిన వెంటనే ఎవరి నీడను చూడకూడదు. ఇది జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది అంతేకాకుండా ఆర్థిక నష్టం కూడా కలుగుతుంది. అందుకే ఈ తప్పును ఎప్పుడూ పునరావృతం చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ముందుగా ఉదయాన్నే నిద్రలేచి సూర్య భగవానుని దర్శనం చేసుకోవాలి.

చాలా మందికి ఉదయం లేవగానే అద్దం(Mirror) లో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. కానీ ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దం వైపు చూడటం అశుభం. ఉదయం లేచి అద్దంలో చూసుకుంటే నెగెటివ్ ఎనర్జీ(Negative Energy) అంతా లోపలికి వస్తుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత చేయవలసిన మొదటి పని భగవంతుని నామస్మరణ. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ చుట్టూ ఉంటుంది.

తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత వన్యప్రాణుల ఫోటోలు చూడకండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల రోజంతా ఎప్పుడైనా వివాదాలు తలెత్తవచ్చు.

Also Read : సెక్రటేరియేట్‌ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

#vastu-shastra #mirror #morning-wakeup #vastu-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe