Viral Video : ఆ తేదీన ఎయిరిండియా ఫ్లైట్‌ ఎక్కొద్దు.. ఖలిస్థాన్ ఉగ్రవాది వార్నింగ్‌తో టెన్షన్ టెన్షన్..!!

నవంబర్ 19న ఎయిరిండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దంటూ ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఓ వీడియోలో సూచించాడు. ఈ వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

author-image
By Bhoomi
New Update
Viral Video : ఆ తేదీన ఎయిరిండియా ఫ్లైట్‌ ఎక్కొద్దు.. ఖలిస్థాన్ ఉగ్రవాది వార్నింగ్‌తో టెన్షన్ టెన్షన్..!!

ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతను నవంబర్ 19 న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కులకు సూచించాడు. లేని పక్షంలో మీ "ప్రాణాలు ప్రమాదంలో పడతాయి" అంటూ ... పన్నూ వీడియోను విడుదల చేశారు. కెనడాలో ఉంటున్న ఖలిస్తానీ టెర్రరిస్టు, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురపత్వంత్ పన్నూన్ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఎయిరిండియా దిగ్భందిస్తాం. ఆ రోజు ఇండియా విమానాల్లో ప్రయాణించకూడదు..లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందంటూ వీడియోలో పేర్కొన్నాడు.

కాగా నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయం మూసివేస్తామని..భవిష్యత్తులో దాని పేరు కూడా మారుతుందని పన్నూ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుత క్రికెట్ ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఇదేనని ఖలిస్తానీ ఉగ్రవాది హైలైట్ చేశాడు.

అక్టోబరు 10న అమెరికాకు చెందిన నిషేధిత సిక్కుల ఫర్ జస్టిస్ (SFJ) ఆర్గనైజేషన్‌కు నేతృత్వం వహిస్తున్న పన్నూ, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నుంచి భారత్‌లో ఇలాంటి "ప్రతిస్పందన" జరగకుండా నేర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. "పంజాబ్ నుండి పాలస్తీనా వరకు అక్రమ ఆక్రమణ ప్రజలు ప్రతిస్పందిస్తారు. హింస హింసను ప్రేరేపిస్తుందని మేము చెబుతున్నాము" అని ఇంతకుముందు రిలీజ్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: బండి…మేము రెడీ..రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనకు బీజేపీ ప్లాన్..!!

అమృత్‌సర్‌లో జన్మించిన పన్ను 2019 నుండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) యొక్క రాడార్‌లో ఉన్నాడు, దర్యాప్తు ఏజెన్సీ అతనిపై మొదటి కేసు నమోదు చేసింది. అతను తీవ్రవాదం, తీవ్రవాద కార్యకలాపాలను సమర్థించడం, నిర్వహించడం, బెదిరింపులకు పాల్పడటం, పంజాబ్ తోపాటు ఇండియాలోని ఇతర ప్రాంతాలలో భయభ్రాంతులను వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని ఆరోపించారు. ఫిబ్రవరి 3, 2021న ప్రత్యేక NIA కోర్టు పన్నూపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 29న పన్నూను "ప్రకటిత నేరస్థుడు" (PO)గా ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు