Drugs Case : గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు(Drugs Case) టాలీవుడ్(Tollywood) ప్రముఖుల మెడకు చుట్టుకుంటుంది. ఈ కేసులో అనుమానితుడిగా టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ ని ఎఫ్‌ఐఆర్ లో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 9 మంది పై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.
దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిష్(Krish) తప్పకుండా విచారణకు రావాల్సి ఉంటుందని డీసీపీ వినీత్ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గత వారం రాడిసన్ హోటల్(Radisson Hotel) మీద దాడులు చేసిన పోలీసులు పెద్ద మొత్తంలో కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ కేసులో టాలీవుడ్ కి చెందిన ఓ నిర్మాత, ఓ మోడల్ పేరు కూడా వినిపిస్తుంది. రాడిసన్ హోటల్ కి డ్రగ్స్ తీసుకుని వచ్చిన అబ్బాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు. హోటల్ లో పార్టీ జరుగుతున్న సమయంలో హోటల్ లో ప్రముఖ దర్శకుడు క్రిష్ అరగంట పాటు పోలీసులు గుర్తించారు. ఆయన హోటల్ యజమాని వివేకానందతో మాట్లాడినట్లు సమాచారం.
అందుకే అనుమానంతో పోలీసులు క్రిష్ పేరుని కూడా ఎఫ్ఐఆర్(FIR) లో చేర్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే క్రిష్ కి వైద్య పరీక్షలు నిర్వహిస్తే అనుమానాలన్ని తీరిపోతాయని పోలీసులు తెలిపారు. రక్త పరీక్షలు చేసి విచారించబోతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో తన పేరు చేర్చడంతో క్రిష్ స్పందించారు. గత వారం రాడిసన్ హోటల్ కి వెళ్లిన మాట నిజమే అని ఆయన పేర్కొన్నారు. అయితే పార్టీలో పాల్గొనేందుకు కాదని... ఓ స్నేహితున్ని కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు ఆయన వివరించారు. డ్రైవర్ రావడం ఆలస్యం కావడంతో కాసేపు హోటల్ యజమాని వివేకానందతో మాట్లాడినట్లు క్రిష్ వివరించారు.
డ్రైవర్ వచ్చిన వెంటనే అక్కడ నుంచి కారులో వెళ్లిపోయినట్లు క్రిస్ పేర్కొన్నారు. అంతేకానీ డ్రగ్స్ విషయంలో తనకి ఎలాంటి సంబంధం లేదని క్రిష్ వివరించారు.
Also Read : ఫ్రీ కంరెంట్ కు రెండు కండీషన్స్.. మళ్లీ అప్లై ఎలా అంటే!