Vijaykanth Health: తమిళ నటుడు విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తమిళ నటుడు, డీఎండీకే పార్టీ చీఫ్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఆయనకు పల్మనరీ చికిత్స అత్యవసరం అని తెలిపారు వైద్యులు. ఇందుకోసం మరో 14 రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. By Shiva.K 29 Nov 2023 in సినిమా నేషనల్ New Update షేర్ చేయండి Vijaykanth Health Condition: తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అనారోగ్య సమస్యల కారణంగా వారం క్రితం హాస్పిటల్లో చేరారు విజయ్ కాంత్. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనకు.. అప్పటినుంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో ఆయన ఆరోగ్యం కాస్త స్థిమితంగానే ఉందన్న వైద్యులు.. పల్మనరీ చికిత్స చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం మరో 14 రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందని తెలిపారు వైద్యులు. విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వస్తుండటంతో పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో విజయ్ కాంత్ ఇంటికే పరిమితమవడంతో.. పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి ప్రేమలత భుజాన వేసుకున్నారు. ఆమె దగ్గరుండి పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. Also Read: తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ! #vijaykanth-health-condition #telugu-latest-top-news #telugu-news #telugu-latest-news #vijay-kanth-health మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి