AP Politics: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. చంద్రబాబుతో డీకే శివకుమార్ చర్చలు

టీడీపీ అధినేత చంద్రబాబు ను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కలిసిన డీకే శివకుమార్.. పక్కకు తీసుకెళ్లి మరీ చర్చలు జరిపారు. దీంతో వీరి భేటీ ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనియాంశమైంది. ఇండియా కూటమిలోకి చంద్రబాబును తీసుకెళ్లడానికి డీకే ప్రయత్నిస్తున్నాడంటూ టాక్ కు కారణమైంది.

New Update
AP Politics: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. చంద్రబాబుతో డీకే శివకుమార్ చర్చలు

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashanth Kishore) ఇటీవల చంద్రబాబును (Chandrababu) కలవడంతో ఏపీలో ఎంతటి పొలిటికల్ హీట్ రగిలిందో అందరికీ తెలిసిన విషయమే. తాజా ఏపీ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బెంగూళురు ఎయిర్పోర్టులో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఎదురుపడ్డారు. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లిమరీ డీకే మంతనాలు జరపడం చర్చనీయాంశమైంది. వారిద్దరూ ఏయే అంశాలపై మాట్లాడారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ వ్యక్తం అవుతోంది. వీరిద్దరూ అనుకోకుండా కలిశారా? లేక కావాలనే కలిశారా? అన్న అంశంపై కూడా చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Kurnool : మంత్రి కొట్టు సత్యనారాయణ వర్సెస్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

అయితే.. చంద్రబాబును ఇండియా కూటమిలోకి తీసుకెళ్లడానికి డీకే శివకుమార్ ప్రయత్నం చేస్తూన్నరన్న చర్చ కూడా మొదలైంది. మరో వైపు షర్మిల కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుండడం.. ఇటీవల ఆమె నారా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే టీడీపీ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకట్టే అవకాశాన్ని కూడా కొట్టి పడేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిసిన సమయంలో తీవ్రంగా స్పందించిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారోనన్న అంశం కూడా రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. అయితే.. కుప్పుం వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అదే సమయంలో నాగపూర్ వెళ్లడానికి డీకే శివకుమార్ ఎయిర్పోర్టుకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరు ఎదురుపడ్డారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు