DK Shiva Kumar: కర్ణాటకకు రండి చూపిస్తాం.. కేసీఆర్, కేటీఆర్ కు డీకే శివకుమార్ సవాల్ కర్ణాటకలో తామ ఎన్నికల హామీల అమలును చూడడానికి కేసీఆర్, కేటీఆర్ రావాలని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ సవాల్ విసిరారు. సమయం చెబితే వారిని స్పెషల్ బస్సులో తమ రాష్ట్రానికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణలో డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం రానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. By Nikhil 28 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని.. కానీ పదేళ్లయినా కేసీఆర్ (CM KCR) హామీలను అమలు చేయలేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar) ధ్వజమెత్తారు. ఈ రోజు తాండూరులో నిర్వహించిన పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. కానీ, పదేళ్లయినా కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని ఆరోపించారు. కర్ణాటకలో తాము 5 గ్యారంటీలను అమలు చేశామన్నారు. గృహజ్యోతి ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ప్రతీ మహిళకు నెలకు రూ. 2000 అందిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: Telangana Elections 2023: బీసీ నేతలను కాంగ్రెస్ విస్మరించిందా? తాము చెప్పేది నిజమో, కాదో కర్ణాటకలో ప్రతీ ఇంటికి వెళ్లి అడగండి... మీకే తెలుస్తుందన్నారు. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ ప్రతీ మహిళకు కాంగ్రెస్ ఉచిత బస్సు ప్రయాణం అందించనుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రానుందని జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ వెళ్లి రెస్ట్ తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. బీజేపీకి బీటీమ్ లా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేసీఆర్.. కేటీఆర్ కు సవాల్.. మీరు కర్ణాటకకు రండి... మేం ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామో లేదో చూపిస్తామని కేసీఆర్, కేటీఆర్ కు డీకే శివకుమార్ సవాల్ విసిరారు. తేదీ , సమయం చెబితే.. వారిని బస్సులో తీసుకెళ్లి నిరూపించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. #telangana-election-2023 #telangana-congress #dk-shiva-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి