No deepavali: ఆ గ్రామ ప్రజలు 200 ఏళ్లుగా దీపావళిని జరుపుకోవడం లేదు..ఎందుకంటే!

కర్ణాటక దావణగెరె జిల్లాలోని లోకికెరె ప్రాంత ప్రజలు సుమారు 200 సంవత్సరాల నుంచి దీపావళి పర్వదినానికి దూరంగా ఉంటున్నారు.గతంలో జరిగిన సంఘటనల వల్ల దీపావళిని చీకటి రోజుగా భావిస్తారు ఆ గ్రామ ప్రజలు.

New Update
No deepavali: ఆ గ్రామ ప్రజలు 200 ఏళ్లుగా దీపావళిని జరుపుకోవడం లేదు..ఎందుకంటే!

దీపావళి (Deepavali) పిల్లలతో పాటు పెద్ద వారు కూడా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. ఇంటినిండా దీపాలతో చీకట్లు పారదోలేందుకు కాంతులను నింపేందుకు ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగకకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాయంత్రం పూట టపాసులు కాలుస్తూ ..చిన్నా పెద్ద అంతా కూడా సరదగా జరుపుకుంటారు.

ఆ రోజు ఉదయాన్నే లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా పూజిస్తారు. అలాంటి దీపావళి పండుగను జరుపుకోని గ్రామాలు కొన్ని ఉన్నాయని మీకు తెలుసా. కర్ణాటక, తమిళనాడులోని పలు గ్రామాల ప్రజలు కొన్ని శతాబ్దాలుగా ఆ పండుగను జరుపుకోవడం లేదు. కర్ణాటక దావణగెరె జిల్లాలోని లోకికెరె ప్రాంత ప్రజలు సుమారు 200 సంవత్సరాల నుంచి దీపావళి పర్వదినానికి దూరంగా ఉంటున్నారు.

Also read: రియల్ మీ ఫోన్ పై భారీ తగ్గింపు.. రూ. 10 వేల లోపే!

గతంలో జరిగిన సంఘటనల వల్ల దీపావళిని చీకటి రోజుగా భావిస్తారు ఆ గ్రామ ప్రజలు. కేవలం గ్రామంలో ఉన్న వారు మాత్రమే కాదు. గ్రామం నుంచి బయట ఊర్లకు వెళ్లినా..ఆఖరికి విదేశాలకు వెళ్లిన కూడా ఈ పండుగను జరుపుకోరు. అందుకే దీపావళి నాడు జరిపే పూజను ముందుగానే విజయదశమి నాడు జరుపుకుంటారు.

మరికొంతమంది మహాలయ అమావాస్య నాడు జరుపుకుంటారు. అంతేకాకుండా దీపావళి నాడు పండుగ జరుపుకుంటే చెడు జరుగుతుందని నమ్ముతారు. దీపావళి రోజున పండుగ చేసుకుంటే మాత్రం కచ్చితంగా చెడు జరుగుతుందని వారు నమ్ముతారు. 200 సంవత్సరాల క్రితం లోకికెరె గ్రామానికి చెందిన కొందరు దీపావళి రోజున పెద్దల పండుగను జరుపుకోవడానికి కుశగడ్డి, పూలు తెచ్చేందుకు అడవికి వెళ్లారు. గడ్డి తీసుకురావడానికి వెళ్లిన వారెవరూ తిరిగి రాలేదు.

వారి కోసం వెళ్లిన వారికి ఎవరికీ కూడా ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలో దీపావళిని జరుపుకోకూడదని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి పండుగను చేసుకోవటం మానేశారు.

ఇదిలా ఉంటే తమిళనాడు శివగంగై జిల్లాలోని 12 ప్రాంతాల ప్రజలు కూడా గడిచిన 60 సంవత్సరాలుగా దీపావళి పండుగ జరుపుకోవడం లేదు. వ్యవసాయ పనులు లేని సమయంలో పండుగను జరుపుకోవాలంటే ప్రజలపై ఆర్థికంగా భారం పడుతుందని ఆ గ్రామాల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.

అప్పటి నుంచి 12 గ్రామాల ప్రజలు ఈ పండుగకు జరుపుకోవటం లేదని స్థానికులు తెలిపారు. గ్రామస్థులు ఎక్కడ ఉన్నా సరే ఈ పండుగకు దూరంగా ఉంటారని చెప్పారు. 12 గ్రామాల ప్రజలు ఈ పండుగ రోజు చేయాల్సిన పూజలను సంక్రాంతి రోజున చేస్తారని వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు