Divorce case: ముస్లిం మహిళలకు విడాకుల భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!

విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులేనంటూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.125 సీఆర్‌పీసీని సవాల్ చేస్తూ ఓ భర్త వేసిన పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం.. 125 సెక్షన్ వివాహితలకే కాకుండా మహిళలందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Divorce case: ముస్లిం మహిళలకు విడాకుల భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!
New Update

Muslim Womens: విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భరణం ఇవ్వాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ మేరకు 125 సీఆర్‌పీసీ ప్రకారం డివోర్స్ తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కేసును పరిశీలించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో విడాకుల తర్వాత వారు భరణానికి అర్హులేనని, భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్‌, జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఆ వ్యక్తి పిటిషన్ ను కొట్టివేసింది. భరణానికి సంబంధించిన హక్కును కల్పించే ఆ సెక్షన్‌ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.

మహిళలందరికీ వర్తిస్తుంది..
ఈ మేరకు ‘125 సెక్షన్ వివాహితలకే కాకుండా మహిళలందరికీ వర్తిస్తుంది. మతంతో సంబంధం లేకుండానే ఈ సెక్షన్ కింద భరణం కోరవచ్చు. భరణం ఇవ్వడం అనేది దానం చేయడం కాదు. భార్య మానసికంగా, ఇతర రకాలుగా ఆధారపడి ఉంటుందనే వాస్తవాన్ని కొందరు భర్తలు గుర్తించడం లేదు. ఇల్లాలి పాత్రను, ఆమె త్యాగాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చింది’ అని ధర్మాసనం పేర్కొంది.

#supreme-court #divorced-muslim-women #entitled-to-maintenance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe