zombie deer diseas: కలవరపెడుతున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..శాస్త్రవేత్తల ఆందోళన

ప్రపంచాన్ని కొత్తగా జాంబీ డీర్‌ డిసీజ్‌ ఆందోళనకు గురిచేస్తుంది. ఈ వ్యాధిని క్రానిక్‌ వేస్టింగ్‌ డిసీజ్‌ అని కూడా పిలుస్తున్నారు. ఇది జంతువులను అపస్మారక స్థితి, గందరగోళానికి గురి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశాలున్నాయి.

Zombie Deer Disease: వామ్మో...వేగంగా విస్తరిస్తోన్న జాంబీ డీర్ డిసీజ్...మరో పెను ముప్పు తప్పదా..!!
New Update

zombie deer diseas: ఓవైపు కరోనా కొత్త వేరియంట్‌ ప్రపంచాన్ని కలవరపెడుతుండగా కొత్తగా జాంబీ డీర్‌ డిసీజ్‌ ఆందోళనకు గురిచేస్తుంది. ఇది మరో విపత్తుగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఈ జాంబీ డీర్‌ డిసీజ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు జింకలే పరిమితమైన ఈ వ్యాధి మనుషులకు కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ వ్యాధిని క్రానిక్‌ వేస్టింగ్‌ డిసీజ్‌ అని కూడా పిలుస్తున్నారు. ఇది జంతువులను అపస్మారక స్థితి, గందరగోళానికి గురి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని మొదటి కేసు నవంబర్‌లో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో గుర్తించారు. తొలుత ఈ వ్యాధి అమెరికాలోని వ్యోమింగ్‌లో జింక, దుప్పి శాంపిల్స్‌లో కనుగొనబడింది. ఇది దీర్ఘకాలిక వ్యాధి అని, నెమ్మదిగా పెను విపత్తుగా మారుతుందని అంటున్నారు. అలాగే ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని, ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు.

మెదడుతో పాటు కణజాలాల్లో పేరుకుపోతుంది

పర్యావరణం కలుషితం అవుతున్నందున మనుషులకు తొందరగా సోకే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే మానవుల్లో ఈ కేసును గుర్తించలేదు. జాంబీ డీర్ డిసీజ్ ప్రాణాంతకమైన అంటువ్యాధి, ఇది ఎక్కువగా ఎల్క్, జింక, దుప్పి, రెయిన్ డీర్, కారిబౌ జంతువుల్లో వస్తుంటుంది. ఈ వ్యాధి సోకితే ప్రియాన్‌ అనే పదార్థం మెదడుతో పాటు కణజాలాల్లో పేరుకుపోతుందని, దీంతో జంతువుల ప్రవర్తనలో మార్పులతో పాటు చివరికి మరణానికి దారి తీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జింకల్లో ఈ వ్యాధి లక్షణాలు

అంతేకాకుండా.. కోతులు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయని, ఈ వ్యాధి జంతువుల శరీర ద్రవాలు కలిసినా లేదా సంపర్కం ద్వారా వస్తుందని, మలం, నేల, వృక్ష సంపద వంటి పర్యావరణంలో ప్రసరించే అంటు కణాలతో కూడా పరోక్షంగా వ్యాపిస్తుందని చెబుతున్నారు. జంతువుల మేత లేదా పచ్చిక బయళ్లకు ఈ వైరస్ సోకితే మిగతా జంతువులకు కూడా వ్యాపిస్తుందంటున్నారు. జింకల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడటానికి ఏడాది కంటే ఎక్కువ సమయం పడుతుందని, జింక బరువులో తగ్గుదల, తడబడటం, శక్తిని కోల్పోవడం జరుగుతుందని, ఈ వైరస్‌కు చికిత్స, వ్యాక్సిన్‌ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత బరువు పెరుగుతున్నారా..ఇలా చేయండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe