TS: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్!

పండగపూట తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందజేయనున్నట్లు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఆధార్ నంబర్ ఆధారంగా స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ నంబర్ ఇస్తామన్నారు.

New Update
TS: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్!

Health card: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ పండుగపూట శుభవార్త చెప్పింది. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా వైద్య సాయం కోసం తమ వంతు సహాయం అందించేందుకు హెల్త్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలందరికీ జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందజేయనున్నట్లు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

ఇది కూడా చదవండి: KTR: 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపిన కేటిఆర్ బావమరిది.. ఎందుకంటే?

జూలై నుంచి పంపకాలు..
ఈ మేరకు సోమవారం హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ లో ఓ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు.. రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతేకాదు ఎమర్జెన్సీలో అవసరమైన ట్రీట్ మెంట్ అందించడానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ప్రత్యేక నంబరుతో అందనుందని స్పష్టం చేశారు. ఆధార్ నంబర్ ఆధారంగా ప్రతి ఒక్కరికీ స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ నంబర్ ఇస్తామని తెలిపారు. పేరు నమోదు చేయగానే వ్యక్తికి సంబంధించిన వైద్య సేవల వివరాలు తెలుసుకోవచ్చని, ఏ వైద్యుడిని కన్సల్ట్ చేసినా.. వెంటనే హెల్త్ కండిషన్ తెలుసుకుని చికిత్స పొందే చాన్స్ ఉంటుందని ఆయన అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు