TTD Board: రద్దయిన టీటీడీ బోర్డు....24 మంది సభ్యుల రాజీనామా!

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దయ్యింది. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన బోర్డును గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేయగా, ఇప్పుడు 24 మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు.

New Update
TTD Board: రద్దయిన టీటీడీ బోర్డు....24 మంది సభ్యుల రాజీనామా!

TTD Board : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు రద్దయ్యింది. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన బోర్డును గత వైసీపీ (YCP) ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీరు మాత్రమే కాకుండా నలుగురు ఎక్స్‌ ఆఫీషియో మెంబర్లు కూడా ఉన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఇప్పటికే రాజీనామా చేయగా, ఇప్పుడు 24 మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు. వారందరి రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి రాజీనామాల ఆమోదంతో టీటీడీకి కొత్త చైర్మన్‌ను, బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించుకోవాల్సి ఉంది.

Also read: నేపాల్ లో టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. అందులో 19 మంది!



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు