BRS Party: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లు.. విచారణ వాయిదా

TG: తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో వెళ్లిన నేతలపై వేసిన అనర్హత పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యే దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంక్రటావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

New Update
DSC Postponement: డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలి.. హైకోర్టుకు నిరుద్యోగులు

High Court: తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరిన ఎమ్మెల్యేలపై హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు విచారణ జరిపిన ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి ఎమ్మెల్యే దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంక్రటావు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాగా మరో 12 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: సొంతగూటికి కేకే.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక!

Advertisment
Advertisment
తాజా కథనాలు