AP: పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?

ఏపీలో పార్టీ మారిన 8మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారణ చేపట్టగా వీరేవరూ రాకపోవడంపై స్పీకర్ సీరియస్ అయ్యారు. న్యాయ సలహా తర్వాత అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

New Update
AP: పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?

AP Rebel MLA's: ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ 8మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పార్టీ మారిన వైసీపీ (YCP), టీడీపీ (TDP) రెబెల్ ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని స్పీకర్ పేషీ ఆదేశాలు జారీ (Speaker Notices) చేశారు.

వివరణ ఇవ్వాలని నోటీసులు..
ఈ మేరకు పార్టీ మార్పు వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు ఒక్కో ఎమ్మెల్యే 15 నిమిషాల సమయం తీసుకోవచ్చిన స్పీకర్ స్పష్టం చేశారు. అయితే వివరణ ఇవ్వాలా? వొద్దా? అనే దానిపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన వివరణ ఇచ్చేందుకు 30 రోజులు సమయం కావాలని వైసీపీ రెబెల్స్ స్పీకరుకు లేఖ పంపించారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం 60 రోజులు గడువు ఇవ్వొచ్చని ఇందులో పేర్కొన్నారు. ఇక తనకు ఆరోగ్యం బాగోలేదని, నాలుగు వారాలు సమయం ఇవ్వాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) స్పీకర్ ను కోరారు. అయితే ఈ లేఖలపై స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం (Tammineni Sitaram) ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా.. ఫ్రిబవరి 29న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి : రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్ లా? ఇది అన్యాయం:ఎమ్మెల్సీ కవిత

అనర్హత పై నిర్ణయం..
ఇదిలావుంటే.. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ (Rajya Sabha Elections)  వచ్చేలోపే ఎమ్మెల్యేల అనర్హత పై నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఒక‌వేళ స్పీకర్ ఎదుట వారంతా హాజరైతే ఏమని వివరణ ఇస్తారు. స్పీకర్ సంతృప్తి వ్యక్తం చేస్తారా? లేదా అన‌ర్హత వేటు వేస్తారా? అనే అంశం చర్చనీయాంశమైంది. ఒకవేళ ఎమ్మెల్యేలు హాజరు కాలేనియెడల స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది.

టీడీపీ నుంచి వంశీ, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాల గిరిధ‌ర్, విశాఖ‌ప‌ట్నం ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి ఆనం, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు