రెవెన్యూ సిబ్బంది అభ్యంతరం
రూరల్ సీఐ కార్యాలయం గతంలో అన్నక్యాంటీన్ కోసం నిర్మించిన భవనంలో కొనసాగుతుంటే.. టౌన్ స్టేషన్ మీసేవ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఇటీవల సబ్‌కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా గతంలో పోలీస్‌స్టేషన్, ఆఫీసర్స్‌క్లబ్ ఉన్న ప్రదేశాలన్నింటిని సబ్ కలెక్టర్ ప్రాంగణంలోనే ఉండే విధంగా గోడ నిర్మాణం చేపట్టారు. ఇదిలా ఉంటే జూలై 21 సాయంత్రం కొత్తగా నిర్మించిన గోడ వద్దకు ఎక్స్‌కవేటర్ వెళ్లింది.ఈ విషయం గుర్తించిన రెవెన్యూ సిబ్బంది అభ్యంతరం తెలిపారు.
ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి
ఈ ప్రాంగణ మంతా రెవెన్యూదని రికార్డులు చూపించారు. దీంతో పోలీసులు కూడా గతంలో ఈ స్థలం కేటాయిస్తూ జారీ అయిన కాగితాలను చూపించారు. ఈ విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ సూర్యతేజ కార్యాలయానికి చేరుకున్నారు. డీఎస్పీ మనోహరాచారి, సీఐలు సురేష్‌బాబు, శ్రీనివాసులతో దాదాపు 2 గంటల పాటు ఈ వివాదంపై చర్చలు జరిగాయి. తహసీల్దార్ ఫాజిల్ కూడా చర్చల్లో ఉన్నారు. బ్రిటిష్ కాలం నాటి రికార్డులను పోలీసులకు చూపించారు. ఈ స్థలం తమదేనని అందుకే గోడ నిర్మాణం చేపట్టామని తహ సీల్దార్ వివరించారు. ఇటు పోలీసులు తమకు కేటాయిస్తూ ఉన్న పత్రాలను సబ్‌కలెక్టర్‌కు అందించారు. చివరికి ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నేతలు, ఉన్నతాధికారులు ఈ స్థలంపై ఏ విధంగా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.