Discount On TS Traffic Challans: తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. చలాన్లపై రాయితీని మరోసారి పొడిగించింది. వచ్చే నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా ఇప్పటివరకు ప్రభుత్వ ఖజానాకు రూ.135 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ALSO READ: రాహుల్ గాంధీపై దాడి
ఇది రెండో సారి..
వాహనదారులకు పెండింగ్ చలాన్ల (Pending Challans) నుంచి ఉపశమనం కలిపించేందుకు గత ఏడాది డిసెంబర్ 27న చలాన్ల రాయితీని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మొదట 15 రోజులు గడువు ఇచ్చిన సర్కార్.. ఆ తర్వాత జనవరి 31 వరకూ పెండింగ్ చలాన్లు కట్టేందుకు అవకాశం కలిపించింది. తాజాగా మరోసారి 15 రోజులు గడువును పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ 44 శాతం మాత్రమే పెండింగ్ చలాన్ల చెల్లించినట్లు పేర్కొంది. డిసెంబర్ 27 నుంచి జనవరి 30 వరకూ రూ.139 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారాలు గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
Website: https://echallan.tspolice.gov.in/publicview/
డిస్కౌంట్‌ల వివరాలు :
* ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీ.
* టూ వీలర్ చలాన్లపై 80 శాతం రాయితీ.
* ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం రాయితీ.
* లారీ, ఇతర భారీ వాహనాల చలాన్లపై 50 శాతం రాయితీ.
2022లో ట్రాఫిక్ చలానాలపై రాయితీ ఇలా..
2022 మార్చి 31 నాటికి తెలంగాణలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించింది రాష్ట్ర సర్కార్. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ అవకాశాన్ని 65 శాతం మంది వాహనదారులు ఉపయోగించుకున్నట్లు సమాచారం. తాజాగా గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ రెండు కోట్లకు చేరుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి రాయితీ ప్రకటించనున్నారు.
ALSO READ: ఉచిత బస్సు ప్రయాణం.. అలా చేస్తే జైలుకే.. సజ్జనార్ వార్నింగ్